గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ చరిత్ర చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 1500 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు క్రిస్ గేల్ రికార్డ్‌లను అధిగమించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ఈ ఫీట్ సాధించాడు.
షాన్ మార్ష్ రికార్డ్ బద్దలు..
ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ 23 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో 1500 పరుగుల మైలురాయి అందుకున్నాడు. 35 ఇన్నింగ్స్‌ల్లో సాయి సుదర్శన్ ఈ ఫీట్ సాధించడం విశేషం. ఈ క్రమంలోనే షాన్ మార్ష్ పేరిట సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ రికార్డ్‌ను అధిగమించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1500 పరుగులు చేసిన జాబితాలో సాయి సుదర్శన్(35 ఇన్నింగ్స్‌లు)తో పాటు షాన్ మార్ష్(36 ఇన్నింగ్స్‌లు), క్రిస్ గేల్(37 ఇన్నింగ్స్‌లు), మైకేల్ హస్సీ(40 ఇన్నింగ్స్‌లు), సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్(44 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.

సచిన్ రికార్డ్ బ్రేక్..
టీ20ల్లో 2000 పరుగుల మైలురాయి అందుకున్న సాయి సుదర్శన్.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. 54 ఇన్నింగ్స్‌ల్లో సాయి సుదర్శన్ ఈ ఘనతను అందుకోగా.. సచిన్ టెండూల్కర్(59), రుతురాజ్ గైక్వాడ్(60), దేవదత్ పడిక్కల్(61), రజత్ పటీదార్(61) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఒక్కసారి డకౌట్ కానీ సాయి..
ఈ 54 ఇన్నింగ్స్‌ల్లో సాయి సుదర్శన్ ఒక్కసారి డకౌట్ కాకుండా 2000 పరుగులు సాధించాడు. ఈ ఘనతను అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. టీ20ల్లో డకౌట్ కాకుండా అతను 2016 పరుగులు చేయగా.. ఫ్లెమింగ్ 1420, మార్క్ 1378 పరుగులు చేశారు.