Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అందుకే రాహుల్‌ త్రిపాఠిని పక్కన పెట్టాం: రుతురాజ్ గైక్వాడ్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ ఈ వికెట్ స్లోగా అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. తమ జట్టులో ఇతర టీమ్స్‌కు సారథ్యం వహించిన ఆటగాళ్లు ఉన్నారని, కెప్టెన్సీ విషయంలో వారు తనకు అండగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చాడు. కాంబినేషన్‌లో మార్పు చేయలేదని, ఫిట్‌గా లేని ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో సమీర్ రిజ్వీ ఆడుతున్నాడని అక్షర్ తెలిపాడు.

IPL 2025 Ruturaj Gaikwad Reveals The Reason Why Rahul Tripathi Not Playing In CSK vs DC Match

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా రెండు మార్పులు చేశామని, రాహుల్ త్రిపాఠిని తప్పించామన్నాడు. 'పిచ్ కొంచెం డ్రైగా ఉంది. మబ్బులు కూడా కమ్ముకున్నాయి. పిచ్‌లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. టీ20 క్రికెట్‌లో మూమెంటమ్ చాలా ముఖ్యం. ఓవరాల్‌గా మా చర్చలు సానుకూలంగా ఉన్నాయి.

ఫీల్డింగ్‌ను మేం మెరుగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేం చురుకుగా ఉండాలనుకుంటున్నాం. నా మోచేతి బాగానే ఉంది. ఓవర్టన్ స్థానంలో డెవాన్ కాన్వే తుది జట్టులోకి రాగా.. రాహుల్ త్రిపాఠి స్థానంలో ముఖేష్ చౌదరి ఆడుతున్నాడు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. గత మూడు మ్యాచ్‌ల్లో రాహుల్ త్రిపాఠి దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై సీఎస్‌కే మేనేజ్‌మెంట్ వేటు వేసింది.

తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కేఎల్ రాహుల్(కీపర్), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరన.

Story first published: Saturday, April 5, 2025, 15:24 [IST]
Other articles published on Apr 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+