ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 17 పాయింట్స్ సాధించినా.. అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో శనివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఆర్‌సీబీ ఖాతాలో ఓ పాయింట్ చేరింది. 17 పాయింట్లతో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మరోవైపు కేకేఆర్ మాత్రం టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించినా 14 పాయింట్స్ చేరుతాయి. అయితే టాప్-4లో ఉన్న జట్లు ఇప్పటికే మెరుగైన రన్‌రేట్‌తో పాటు 14 ప్లస్ పాయింట్స్‌తో ఉన్నాయి. దాంతోనే కేకేఆర్‌కు అవకాశం లేకుండా పోయింది.
దురదృష్టం వెక్కిరిస్తే..
అయితే దురదృష్టం వెంటాడితే 17 పాయింట్లతో కూడా ఆర్‌సీబీ ఇంటిదారి పట్టే అవకాశం ఉంది. ఆ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ఓడి.. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధించి 18 పాయింట్స్ సాధిస్తే ఆర్‌సీబీ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.

ఆ నాలుగు జట్లు 17 పాయింట్స్ సాధిస్తే..?
ప్రస్తుతం ఆర్‌సీబీ 17 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్కటి గెలిచినా.. రెండు మ్యాచ్‌లు రద్దయినా 18 పాయింట్స్ ఖాతాలో చేరుతాయి. గుజరాత్ రన్ రేట్ కూడా 0.793 కూడా బాగానే ఉంది.
పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో మూడు స్థానంలో ఉంది. ఆ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడుంది. రాజస్థాన్ రాయల్స్‌తో గెలిస్తే 17 పాయింట్స్ చేరుతాయి. ఆర్‌సీబీ కంటే 0.376 మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగానే టోర్నీలో ముందడుగు వేస్తోంది. 14 పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాలి. అప్పుడే 18 పాయింట్స్ ఖాతాలో చేరుతాయి. ఒక మ్యాచ్ గెలిచి మరొకటి రద్దయినా.. 17 పాయింట్స్ మెరుగైన రన్‌రేట్‌తో టోర్నీలో ముందడుగు వేస్తోంది.
ఢిల్లీ సైతం..
13 పాయింట్స్‌తో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా 17 పాయింట్స్.. ఆర్‌సీబీ కంటే మెరుగైన (0.362) రన్‌రేట్‌తో టోర్నీలో ముందడగు వేస్తోంది. అయితే ప్రస్తుతం ఆర్‌సీబీ ఉన్న ఫామ్ నేపథ్యంలో చివరి రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిపోవడం కష్టం. అంతేకాకుండా ఈ రెండింటిలో ఒక్క మ్యాచ్ రద్దయినా.. ఆర్‌సీబీకి అప్పనంగా ఓ పాయింట్ వస్తుంది. అప్పుడు 18 పాయింట్స్‌తో టోర్నీలో ముందడుగు వేస్తోంది.