For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ఏఐ జోస్యం.. రోహిత్ శర్మతో పాటు ఆ నలుగురి ఆటగాళ్లకు జాక్ పాట్ ధర!

ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో భారీ ధర పలికే ఆటగాళ్లను మెటా ఆర్టిఫిషియన్ ఇంటలిజెన్స్(ఏఐ) అంచనా వేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో నలుగురు ఆటగాళ్లు ఈసారి వేలంలో జాక్‌పాట్ ధర పలుకుతారని జోస్యం చెప్పింది. గతేడాది నమోదైన అత్యధిక ధర రికార్డ్ ఈ సారి బ్రేక్ అవుతుందని మెటా ఏఐ అంచనా వేసింది.

ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ భారీ ధర పలికి సరికొత్త చరిత్ర సృష్టించారు. రూ.24.75 కోట్ల భారీ ధరకు మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 17 ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇది రెండో అత్యధిక ధరగా నిలిచిపోయింది.

IPL 2025 Rohit Sharma to KL Rahul meta AI picks 5 players who could be most expensive buy in mega auction

ఈ సారి ఈ రెండు రికార్డులు బద్దలవుతాయని మెటా ఏఐ అంచనా వేసింది.

1.రోహిత్ శర్మ
ఏఐ అంచనా వేసిన ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. అతను వేలంలోకి వస్తే ఫ్రాంచైజీలు ఎగబడతాయని ఏఐ జోస్యం చెప్పింది. ఇక ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ వీడుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌ సారథ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు కట్టబెట్టడంపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతను ముంబై ఇండియన్స్‌‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యాడని జోరుగా సాగుతోంది.

2. కేఎల్ రాహుల్
లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్ కూడా భారీ ధర పలుకుతాడని ఏఐ అంచనా వేసింది. ఎల్‌సీజీ మేనేజ్‌మెంట్‌తో రాహుల్ ద్రవిడ్ విభేదాలు తలెత్తినట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సందర్భంగా కేఎల్ రాహుల్‌ను ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా టీవీ కెమెరాల ముందే తిట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు లక్నో సారథ్య బాధ్యతలను నికోలస్ పూరన్‌కు ఇచ్చేందుకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ సిద్దమైంది. ఈ క్రమంలోనే రాహుల్ ఆ జట్టును వీడేందుకు ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాడు.

3. స్టీవ్ స్మిత్
ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా అత్యధిక ధర పలుకుతాడని ఏఐ అంచనా వేసింది. గత సీజన్‌లో అతను అన్ సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. ఏ జట్టు కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అలాంటి స్మిత్ కోసం ఈసారి జట్లు పోటీపడుతాయని ఏఐ తెలిపింది.

4. ట్రావిస్ హెడ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా భారీ ధర పలుకుతాడని ఏఐ అంచనా వేసింది. అయితే ఎస్ఆర్‌హెచ్ వేలంలోకి అతన్ని వదిలేస్తుందా? లేదా? అనేదానిపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంది.

5. మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా భారీ ధరల పలకవచ్చని ఏఐ అంచనా వేసింది. అతన్ని కేకేఆర్ వదిలేస్తుందా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గత సీజన్‌లో అతనేమి గొప్పగా రాణించలేదు. నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రమే సత్తా చాటాడు. లీగ్ మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేయాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

Story first published: Tuesday, September 24, 2024, 18:37 [IST]
Other articles published on Sep 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+