For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్ అంటే రోహిత్.. డకౌట్ అయిన కుర్రాడికి అండగా నిలిచిన హిట్ మ్యాన్! (వీడియో)

రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అండగా నిలిచాడు. డకౌట్ అయిన కుర్రాడికి ఓ సీనియర్ ప్లేయర్‌గా భరోసా ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రోహిత్ శర్మపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కెప్టెన్ అంటే రోహిత్ అంటూ కొనియాడుతున్నారు.

అసలేం జరిగిదంటే..?
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌‌పై 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌లోని టాప్ క్లాస్ బౌలర్లను సూర్యవంశీ చెడుగుడు ఆడాడు. 11 సిక్సర్లతో ఊచకోత కోశాడు. దాంతో ఈ కుర్రాడిపై సర్వత్రా ప్రశంసలు కురిసాయి. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటూ దిగ్గజ ఆటగాళ్లు కొనియాడారు.

IPL 2025 Rohit Sharma pats Vaibhav Suryavanshi s back after disappointing duck vs MI

ఈ ఇన్నింగ్స్ నేపథ్యంలో ఈ 14 ఏళ్ల బిహార్ కుర్రాడు టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ఈ కుర్రాడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భీకర బౌలింగ్ లైనప్ కలిగిన ముంబైని వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడుతాడా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అతను దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న రెండో బంతికే డకౌటయ్యాడు.

ఓదార్చిన రోహిత్..
ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో వైభవ్ సూర్యవంశీతో రోహిత్ కాసేపు మాట్లాడాడు. అతని భుజం తట్టి ధైర్యం చెప్పినట్లు టీవీ కెమెరాల్లో కనిపించింది. ఆ సమయంలో కామెంట్రీ ప్యానెల్‌లో ఉన్న రవి శాస్త్రి.. ఈ సన్నివేశాన్ని వివరిస్తూ.. రోహిత్ శర్మను మెచ్చుకున్నాడు. 'వైభవ్ సూర్యవంశీ నేర్చుకుంటాడు. రోహిత్ శర్మ అతన్ని ఓదారుస్తున్నాడు. హిట్ మ్యాన్ నుంచి అతనికి కావాల్సిన ప్రోత్సాహక మాటలు వచ్చాయి. 14 ఏళ్ల కుర్రాడు గత మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. కానీ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ఇలా జరగకూడదు. కానీ ఇది ఆట. ఈ వైఫల్యం నుంచి అతను నేర్చుకుంటాడు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 2, 2025, 15:54 [IST]
Other articles published on May 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+