ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేసింది.
ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), రోహిత్ శర్మ(36 బంతుల్లో 9 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. సూర్యకుమార్ యాదవ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 నాటౌట్), హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో మహీష్ తీక్షణ, రియాన్ పరాగ్ చెరో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో పవర్ ప్లేలోనే ముంబై వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ.. రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడింది. ఈ క్రమంలో ర్యాన్ రికెల్టన్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. రోహిత్ శర్మ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
116 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని తీక్షణ విడదీసాడు. ర్యాన్ రికెల్టన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే రోహిత్ శర్మను రియాన్ పరాగ్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదారు.