ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఔటైన తీరు వివాదాస్పదమైంది. యుధ్‌వీర్ సింగ్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికే డెవాన్ కాన్వే ఔటయ్యాడు. బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీని డెవాన్ కాన్వే మిడాఫ్ దిశగా ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని రియాన్ పరాగ్ సునాయసంగా అందుకున్నాడు. కానీ అత్యుత్సాహంతో బంతిని పట్టిన వెంటనే గాల్లోకి విసిరేసాడు. ఇదే వివాదాస్పదమైంది.
నిబంధనల ప్రకారం బంతిని 5 సెకన్ల పాటు పట్టుకోవాలి. కానీ రియాన్ పరాగ్ త్వరగా బంతిని విసిరేసాడు. ఈ విషయాన్ని అంపైర్లు గమనించలేదు. దాంతో సీఎస్‌కే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఔటా? నాటౌటా? అని ప్రశ్నిస్తు పోస్ట్‌లు పెడుతున్నారు. రిప్లేలో కూడా బంతిని హోల్డ్ చేయలేదని కనిపించింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ యువ బౌలర్లు యుధ్ వీర్ సింగ్, ఆకాశ్ మధ్యాల్ తీన్మార్ బౌలింగ్‌తో నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది.
ఆయుష్ మాత్రే(20 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43), డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), శివమ్ దూబే(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) రాణించారు.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుధ్‌వీర్ సింగ్(3/47) , ఆకాశ్ మధ్వాల్(3/29) మూడేసి వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, వానిందు హసరంగా తలో వికెట్ పడగొట్టారు.
మరోసారి ధోనీ(17 బంతుల్లో సిక్స్‌తో 16) జిడ్డు బ్యాటింగ్‌తో సీఎస్‌కే భారీ స్కోర్ అవకాశాలు దెబ్బతీసాడు. ధోనీ స్లో బ్యాటింగ్ కారణంగా డెత్ ఓవర్లలో 15 బంతుల పాటు సీఎస్‌కే ఒక్క బౌండరీ నమోదు చేయలేకపోయింది. మరోవైపు ఒత్తిడికి గురైన శివమ్ దూబే భారీ షాట్ ఆడే క్రమంలోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌లో ధోనీ కూడా ఔటవ్వడంతో 200 ప్లస్ స్కోర్ చేస్తుందనుకున్న చెన్నై 187 పరుగులకే పరిమితమైంది.