రాజస్థాన్ రాయల్స్ తాత్కలిక కెప్టెన్ రియాన్ పరాగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రియాన్ పరాగ్‌కు ఇంత బలుపా? అంటూ కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం అతనికి ఆ మాత్రం అటిట్యూడ్ ఉండాల్సిందేనని కొన్నియాడుతున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో సంచలన విజయాన్నందుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా.. ఫీల్డర్‌గా.. బ్యాటర్‌గా సత్తా చాటాడు. ముఖ్యంగా అతని కెప్టెన్సీ, అద్భుతంగా ఫీల్డింగ్ రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా నిలబెట్టింది.

బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేసిన రియాన్ పరాగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37).. ఫీల్డింగ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో డేంజరస్ శివమ్ దూబేను పెవిలియన్ చేర్చాడు. సూపర్ డైవ్‌తో అసాధారణ క్యాచ్ అందుకున్నాడు. ఇక కెప్టెన్‌గా జోఫ్రా ఆర్చర్‌ను కాదని సందీప్ శర్మతో ఆఖరి ఓవర్ వేయించి ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. తనదైన వ్యూహంతో డేంజరస్ ధోనీని ఔట్ చేసి రాజస్థాన్ రాయల్స్‌కు తొలి విజయాన్ని అందించాడు.
మ్యాచ్ అనంతరం మైదాన సిబ్బంది కోరిక మేరకు వారితో సెల్ఫీ దిగిన రియాన్ పరాగ్ అనంతరం.. వారి మొబైల్‌ను చేతికి ఇవ్వకుండా విసిరేసాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'అటిట్యూడ్ ఎక్కువ.. ఆట తక్కువ'అని ఓ నెటిజన్ క్యాప్షన్‌గా పేర్కొనగా.. కోహ్లీ, రోహిత్, ధోనీ కంటే.. ఈ కుర్రాడు ఎంతో నయమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
23 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ కెప్టెన్‌గా ఎదిగాడని, ఆ వయసులో ఆ మాత్రం అటిట్యూడ్ ఉండటం సహజమేనని అండగా నిలుస్తున్నారు. మరికొందరు మాత్రం ఎంతో భవిష్యత్తు ఉందని, ఈ అటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ధోనీ టీమ్‌ను ఓడించిన తర్వాత రియాన్ పరాగ్ దేవుడిలా ఫీలవుతున్నాడని మరికొంతమంది ఫ్యాన్స్ మండిపడుతున్నారు.