For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RR: అందుకే మూడు మార్పులు చేశాం: రియాన్ పరాగ్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పొడిగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ పొడిగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ టైమ్‌లో పిచ్ స్లోగా మారుతుందని ఖచ్చితంగా చెప్పలేను. పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం.

సింపుల్‌గా ఉండటం అవసరం. గత మ్యాచ్‌లో ప్రతీ ఒక్కరు రాణించడం గొప్ప విషయం. వీలైనంత త్వరగా పరిస్థితులను అందిపుచ్చుకోవడం కీలకం. నా ఆటను మెరుగుపరుచుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. దేశవాళీ క్రికెట్ ఆడటం నాకు కలిసొచ్చింది. నా ఆటను ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నాను. మోయిన్ అలీ, రమణ్‌దీప్ జట్టులోకి వచ్చారు.'అని అజింక్యా రహానే చెప్పుకొచ్చాడు.

IPL 2025 Riyan Parag Reveals The Reason Why RR Playing XI Changed against KKR

మరోవైపు టాస్ ఓడిపోవడమే మంచిదైందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. 'టాస్ ఓడిపోయినందుకు సంతోషంగా ఉంది. పిచ్‌పై మాకు క్లారిటీ లేదు. ఇది సవాల్‌తో కూడుకున్న వికెట్. ప్రోఫెషనల్‌గా ఆడాలి. మేం మా పరువు కోసం ఆడాలి. మైదానంలోకి మరింత శక్తిని తీసుకురావాలి. సమష్టి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా. తుది జట్టులో మూడు మార్పులు చేశాం. గాయంతో నితీష్ రానా దూరమవ్వగా.. హసరంగా తుది జట్టులోకి వచ్చాడు. కృనాల్ రాథోడ్, యుధ్‌వీర్ ఈ మ్యాచ్ ఆడుతున్నారు.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్(కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్.

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా.

Story first published: Sunday, May 4, 2025, 15:37 [IST]
Other articles published on May 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+