Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఏడేళ్ల తర్వాత సెంచరీ.. పిల్లి మొగ్గ వేసిన రిషభ్ పంత్ (వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్(61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 నాటౌట్) విధ్వంసకర శతకంతో ముగించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ బౌలర్లను శతక్కొట్టాడు. 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. ఓపెనర్ మాథ్యూ బ్రిట్జ్‌కే(14) ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్‌లో మిడిలార్డర్‌లో ఆడిన పంత్.. తాజా మ్యాచ్‌లో మాత్రం మూడో స్థానానికి తనను తాను ప్రమోట్ చేసుకొని మరి బరిలోకి దిగాడు. వచ్చిన రావడంతోనే యశ్ దయాల్ బౌలింగ్‌ను టార్గెట్ చేసిన పంత్.. అదే జోరును కనబర్చాడు.

7 ఏళ్ల తర్వాత సెంచరీ..
29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిషభ్ పంత్ అనంతరం మరింత దూకుడుగా ఆడి మరో 25 బంతుల వ్యవధిలోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. పంత్‌కు ఐపీఎల్‌లో ఇది రెండో సెంచరీ. అప్పుడెప్పుడో 2018 సీజన్‌లో తొలి సెంచరీ బాదిన రిషభ్ పంత్.. ఏడేళ్ల తర్వాత మరో శతకాన్ని అందుకున్నాడు. సెంచరీ పూర్తయిన వెంటనే పంత్.. సంతోషంతో పిల్లి మొగ్గ వేసి సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IPL 2025 Rishabh Pant s Backflip Celebration After Comeback Century Goes Viral

రూ.27 కోట్లకు న్యాయం..?
ఈ సీజన్ మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు కొనుగోలు చేసి మరి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అతను మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. గత 13 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ కొట్టాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టింది. దాంతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగిన రిషభ్ పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడిననే విషయాన్ని చాటి చెప్పాడు. కీలక ఇంగ్లండ్ పర్యటనకు ముందు పంత్ ఫామ్‌లోకి వచ్చాడు.

సెంచరీ సాధించిన రిషభ్ పంత్‌పై నెట్టింట ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ఈ ఆట ఎక్కడ పెట్టావయ్యా రిషభ్ పంత్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కూడా పంత్ ఆటకు షాకై ఉంటాడని కామెంట్ చేస్తున్నారు. రిషభ్ పంత్ సెంచరీతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంత్‌కు తోడుగా మిచెల్ మార్ష్(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. ఆర్‌సీబీ బౌలర్లలో నువాన్ తుషార, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీసారు.

Story first published: Tuesday, May 27, 2025, 22:21 [IST]
Other articles published on May 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+