లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు విజయం కోసం రిషభ్ పంత్ ఛీటింగ్‌కు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ తొండాట ఆడాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించిన రిషభ్ పంత్‌పై చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే..?
కేకేఆర్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం కేకేఆర్ 234 పరుగులే చేసి ఓటమిపాలైంది. కేకేఆర్ విజయం కోసం రింకూ సింగ్ పోరాడినా ఫలితం దక్కలేదు. టీ20ల్లో మూమెంటమ్ చాలా కీలకం. అయితే రిషభ్ పంత్ తన అతి తెలివితో కేకేఆర్ మూమెంటమ్‌ను దెబ్బతీసాడు.

రిషభ్ పంత్ గాయం డ్రామా..?
భారీ లక్ష్యచేధనలో కేకేఆర్ 12 ఓవర్లలోనే 149/2 పరుగులు చేసింది. చివరి 8 ఓవర్లలో కేకేఆర్ విజయానికి 90 పరుగులే అవసరమయ్యాయి. క్రీజులో రహానే(61) సెట్ అయ్యాడు. దాంతో కేకేఆర్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే పంత్ తెలివిగా వ్యవహరించి గేమ్‌ను ఆపేసాడు. తనకు నడుము నొప్పి అంటూ మైదానంలోనే ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. ఫిజియోలు వచ్చి సపర్యలు చేయడంతో గేమ్ కాసేపు ఆగిపోయింది. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ వరుసగా 5 వైడ్లు వేసి రహానేను చికాకు పెట్టాడు. చివరి బంతికి అతన్ని ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత వచ్చిన రమణ్‌దీప్(1), రఘువంశీ(5), వెంకటేశ్ అయ్యర్(45), రస్సెల్(7) వరుస ఓవర్లలో వెనుదిరిగారు. రింకూ పోరాడినా ఫలితం దక్కలేదు.
రిషభ్ పంత్ గాయం డ్రామాతో కేకేఆర్ మూమెంటమ్‌ను దెబ్బతీసాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లోనూ పంత్ ఇదే తరహా నాటకం ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా మళ్లీ అదే సీన్ రీపిట్ అవ్వడంతో పంత్ మహానటుడంటూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించిన పంత్‌పై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరికొందరు మాత్రం పంత్‌కు అండగా నిలుస్తున్నారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇలానే గాయం నాటకం ఆడిన పంత్‌ను మెచ్చుకున్న అభిమానులు ఇప్పుడు తిట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.