For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అదే మా ఓటమికి కారణం: రిషభ్ పంత్

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో పరాజయం ఎదురైంది. సొంతమైదానంలో పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. అయితే సరైన లక్ష్యాన్ని నమోదు చేయకపోవడమే తమ పతనాన్ని శాసించిందని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు.

ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన పంత్.. తమ లక్ష్యానికి 20-25 పరుగులు అదనంగా చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'మా లక్ష్యం సరిపోదు. మేం 20-25 పరుగులు తక్కువగా చేశాం. అయితే ఆటలో ఇవన్నీ సహజమే. ఇప్పటికీ మా హోమ్ గ్రౌండ్ పరిస్థితులను అంచనా వేస్తున్నాం.

IPL 2025 Rishabh Pant Says we were 25 runs short after PBKS beat LSG by 8 wickets

ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత భారీ లక్ష్యాన్ని నమోదు చేయడం చాలా కష్టం. కానీ మా జట్టులోని ప్రతీ ఒక్కరు మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. స్లో వికెట్‌‌పై ఆడాలనుకున్నాం. స్లోయర్ బాల్స్ ఆగి వస్తాయని భావించాను. మేం ఈ గేమ్ నుంచి నేర్చుకొని ముందుకు సాగాలి. చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్పలేను.'అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. యువ బ్యాటర్లు ఆయుష్ బదోని(33 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 41), అబ్దుల్ సమద్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) తో పాటు నికోలస్ పూరన్(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44)రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/39) రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69), శ్రేయస్ అయ్యర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. నెహాల్ వధేరా(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

Story first published: Tuesday, April 1, 2025, 23:36 [IST]
Other articles published on Apr 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+