For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సాకులు చెప్పడం లేదు.. వారి వల్లే గుజరాత్‌పై గెలిచాం: రిషభ్ పంత్

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన లక్నో సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న లక్నో.. ఓదార్పు విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రిషభ్ పంత్.. టాప్-3 బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్‌తోనే గెలుపొందామని తెలిపాడు. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు.

'ఈ మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. మంచి క్రికెట్ ఆడటం గురించి మేం తరుచూ మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు మంచి క్రికెట్ ఆడగలమని నిరూపించాం. ఈ టోర్నీలో మాకు అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. అయితే గెలుపు ఓటములు ఆటలో ఒక భాగం. గుజరాత్ టైటాన్స్ టాప్ -3 బ్యాటర్లను అడ్డుకోవడం ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకమే, కానీ షారూఖ్ ఖాన్ తన బ్యాటింగ్‌తో తమ జట్టుకు ఆశలు రేపాడు.

IPL 2025 Rishabh Pant Says We can play good cricket after LSG beat GT

అయితే చేధించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉందనే విషయం మాకు తెలుసు. బౌలర్లు కూడా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బౌలింగ్ చేశారు. ఈ టోర్నీనీ ప్రారంభించేటప్పుడే మమ్మల్ని గాయాల బెడద వెంటాడింది. వాటి గురించి మాట్లాడకూడదనుకున్నాం. ఈ టోర్నీలో బ్యాటింగ్ విభాగం రాణించింది. కానీ ఫీల్డింగ్‌లో కొద్దిగా వెనుకబడ్డాం. మా ఓటమికి సాకులు చెప్పడం లేదు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోని ముందుకు సాగాలనుకుంటున్నాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్(27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓటమిపాలైంది. షారుఖ్ ఖాన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. శుభ్‌మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 35), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 38) రాణించాడు. లక్నో బౌలర్లలో విల్ ఓ రూర్కీ(3/27) మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్(2/51), ఆయుష్ బదోని(2/4) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆకాశ్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న లక్నో.. ఓదార్పు విజయాన్నందుకుంది.

Story first published: Friday, May 23, 2025, 8:22 [IST]
Other articles published on May 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+