For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రిషభ్ పంత్

యువ ప్లేయర్ విప్రజ్ నిగమ్ అసాధారణ బ్యాటింగ్‌తోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో వైజాగ్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అనవసర తప్పిదాలతో లక్నో మూల్యం చెల్లించుకుంది. ఢిల్లీ లోయారార్డర్ సంచలన బ్యాటింగ్‌తో తీవ్ర ఒత్తిడికి గురైంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రిషభ్ పంత్.. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామని చెప్పాడు. 'మా టాపార్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఈ వికెట్‌పై ఇది మంచి స్కోర్. జట్టుగా మేం ప్రతీ మ్యాచ్‌లో సానుకూల అంశాలను తీసుకుంటాం. ప్రతీ మ్యాచ్‌లో తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. బేసిక్స్ తగ్గట్లు సరిగ్గా ఆడితేనే టీమ్ భవిష్యత్తు కూడా బాగుంటుంది.

IPL 2025 Rishabh Pant says Vipraj Nigam took the game away from us After DC beat LSG

ఆరంభంలోనే మేం వికెట్లు తీసాం. కానీ ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని మాకు తెలుసు. ఢిల్లీకి రెండు కీలకమైన భాగస్వామ్యాలు దక్కాయి. స్టబ్స్, అషుతోష్‌తో పాటు మరో కుర్రాడు(విప్రజ్ నిగమ్) అద్భుతంగా ఆడాడు. అతనే అసాధారణ బ్యాటింగ్‌తో మా విజయవకాశాలను దెబ్బతీసాడు. మేం ఇంకాస్త మెరుగ్గా మా ప్రణాళికలను అమలు చేయాల్సింది.

మేం ఒత్తిడికి లోనయ్యాం. ఇప్పడిప్పుడే సెట్ అవుతున్నాం. ఈ మ్యాచ్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో లక్ కూడా కీలక పాత్ర పోషించింది. మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశం చేజారింది. అయితే క్రికెట్‌లో ఇవన్నీ సహజమే. ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టకుండా మెరుగై క్రికెట్ ఆడాలి.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఆఖరి ఓవర్‌లో మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని రిషభ్ పంత్ చేజార్చాడు. ఈ స్టంపౌట్ చేసి ఉంటే ఢిల్లీ ఆలౌటై.. లక్నో గెలిచేది.

ఈ మ్యాచ్ ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవరల్లో 8 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసింది. అషుతోష్ శర్మ (31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. విప్రజ్ నిగమ్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), ట్రిస్టన్ స్టబ్స్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

Take a Poll
Story first published: Tuesday, March 25, 2025, 0:20 [IST]
Other articles published on Mar 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+