Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs RCB: ఆర్‌సీబీని శతక్కొట్టిన రిషభ్ పంత్..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం లక్నో వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రిషభ్ పంత్(61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తనదైన హిట్టింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంత్‌కు తోడుగా మిచెల్ మార్ష్(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. ఆర్‌సీబీ బౌలర్లలో నువాన్ తుషార, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీసారు. జితేష్ శర్మ చెత్త కెప్టెన్సీ ఆర్‌సీబీ కొంపముంచింది. పొదుపుగా బౌలింగ్ చేసిన కృనాల్ పాండ్యాకు బంతినివ్వకుండా జితేష్ శర్మ బ్లండర్ మిస్టేక్ చేశాడు.

IPL 2025 Rishabh Pant and Mitch Marsh power LSG to 227 3 vs RCB

దుమ్మురేపిన పంత్, మార్ష్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మాథ్యూ బ్రిట్జ్‌కే(14)ను నువాన్ తుషారా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో అప్‌ది ఆర్డర్ బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్ పంత్, మిచెల్ మార్ష్‌తో కలిసి దూకుడుగా ఆడాడు. యశ్ దయాల్ వేసిన నాలుగో ఓవర్‌లో పంత్ ఓ సిక్స్, రెండు ఫోర్లతో 18 పరుగులు పిండుకున్నాడు. భువీ, నువాన్ తుషార్ కట్టడిగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.

పంత్ సెంచరీ..
పవర్ ప్లే అనంతరం పంత్, మార్ష్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. పోటాపడి బౌండరీలు బాదారు. ప్రతీ ఓవర్‌లో ఈ జోడీ బౌండరీలు బాదడంతో లక్నో 10 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. రిషభ్ పంత్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కాసేపటికే మిచెల్ మార్ష్.. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా ఆడుతున్న ఈ జోడీని భువనేశ్వర్ కుమార్ వీడదీసాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 152 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

మార్ష్ ఔటైనా.. పూరన్‌తో కలిసి పంత్ దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 18వ ఓవర్‌లో బౌండరీ బాది 54 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిషభ్ పంత్‌కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. సెంచరీ పూర్తయిన వెంటనే తన ట్రేడ్ మార్క్ ఫ్లిప్‌ డైవ్‌తో సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన పంత్.. జట్టుకు 227 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

Story first published: Tuesday, May 27, 2025, 21:40 [IST]
Other articles published on May 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+