Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: రూ. 13 కోట్ల భారీ ధర.. రింకూ సింగ్ ఏం చేశాడంటే..?

టీమిండియా యంగ్ సెన్సేషన్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం నేపథ్యంలో రింకూ సింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 13 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.

రిటెన్షన్ జాబితా వెలువడిన కొద్ది రోజులకే రింకూ సింగ్ రూ. 3.5 కోట్లతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఉత్తరప్రదేశ్‌, అలీగఢ్‌లోని అత్యంత ఖరీదైన ఓజోన్ సిటీలో 500 చదరపు గజాల బంగ్లాను కొన్నాడు. ఇటీవలే కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం కూడా చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇదే ఓజోస్ సిటీలో రింకూ సింగ్ తండ్రి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారు.

IPL 2025 Rinku Singh Buys Lavish Bungalow After Retained By Kolkata Knight Riders For Rs 13 Crore

ఇప్పుడు అదే ప్రాంతంలో ఇల్లును కొన్న రింకూ సింగ్.. తన తండ్రిని యజమానిని చేశాడు. దాంతో సక్సెస్ అంటే ఇదే కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్ సంచలన బ్యాటింగ్‌తో స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున జరిగిన ఓ మ్యాచ్‌లో.. యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 5 సిక్స్‌లు బాది కేకేఆర్‌ను గెలిపించాడు.

ఈ ఇన్నింగ్స్‌ రింకూ సింగ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. స్టార్ డమ్ వచ్చినా రింకూ సింగ్ కేకేఆర్ జట్టులోనే కొనసాగాడు. దాంతో అతనికి గత సీజన్‌లో రూ. 55 లక్షల వేతనం మాత్రమే అందింది. తాజా రిటెన్షన్‌లో అతని జీతం ఏకంగా రూ. 13 ప్లస్ రెట్లు పెరిగింది.

రిటెన్షన్ జాబితాల విషయంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా‌ నైట్ రైడర్స్(కేకేఆర్) సంచలన నిర్ణయాలు తీసుకుంది. టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు గత వేలంలో ఆల్‌టైమ్ రికార్డ్ ధర రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌లను వేలంలోకి వదిలేసింది. విధ్వంసకర స్పిన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, బ్యాటింగ్ సెన్సేషన్ రింకూ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీతో పాటు యువ బౌలర్, అనామక ప్లేయర్ హర్షిత్ రాణాతో పాటు మరో అనామక ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్‌లను రిటైన్ చేసుకుంది.

ఈ నలుగురి ఆటగాళ్ల కోసం కేకేఆర్ రూ. 57 కోట్లు ఖర్చు చేసింది. తమ టాప్ ప్లేయర్‌గా రింకూ సింగ్‌ను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకున్న కేకేఆర్.. వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్‌లను రూ. 12, రస్సెల్‌లను రూ. 12 కోట్లకు అట్టిపెట్టుకుంది. అనామక ఆటగాళ్లు అయిన హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌లను రూ. 4 కోట్లుకు రిటైన్ చేసుకుంది. ఆ జట్టు వద్ద ఇంకా రూ.63 కోట్ల పర్స్ మనీ ఉంది. ఆరుగురికి ఆరుగురిని రిటైన్ చేసుకున్న కేకేఆర్‌కు ఎలాంటి ఆర్‌టీఎమ్ కార్డ్ లేదు.

Story first published: Thursday, November 7, 2024, 8:48 [IST]
Other articles published on Nov 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+