Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 రీస్టార్ట్.. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం!

ఐపీఎల్ 2025 రివైజ్డ్ షెడ్యూల్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. మే 17 నుంచి 27 వరకు జరిగే 13 లీగ్ మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా హైదరాబాద్, వైజాగ్ మైదానాలకు కేటాయించలేదు. హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడాల్సిన రెండు లీగ్ మ్యాచ్‌లను కూడా ఇతర వేదికలకు తరలించారు. దాంతో తెలుగు ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను వారం రోజుల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో బీసీసీఐ.. ఐపీఎల్ 2025 సీజన్ రీషెడ్యూల్‌ను సోమవారం రాత్రి ప్రకటించింది.

భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌతిండియా వేదికగానే మిగిలిన మ్యాచ్‌లు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఈ లెక్కన హైదరాబాద్, వైజాగ్ వేదికగా మరిన్ని మ్యాచ్‌లు జరుగుతాయని ఫ్యాన్స్ భావించారు. కానీ బెంగళూరు మినహా సౌతిండియాలో మరే నగరానికి మ్యాచ్‌ కేటాయించలేదు. వర్షాల ప్రభావంతోనే సౌతిండియాను బీసీసీఐ పట్టించుకోలేదని తెలుస్తోంది.

IPL 2025 Revised Schedule No Match In Vizag and Hyderabad

బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై వేదికగా మొత్తం 6 వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. శనివారం ఆర్‌సీబీ, కోల్‌కతా మధ్య బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలను త్వరలో ప్రకటించనున్నారు. భద్రతా కారణాలతో రద్దయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించనున్నారు.

ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ ఇదే..

మే 17: ఆర్‌సీబీ vs కేకేఆర్, బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)

మే 18: రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్, జైపూర్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)

మే 18: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)

మే 19: లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో (రాత్రి 7:30 గంటలకు)

మే 20: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)

మే 21: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై (రాత్రి 7:30 గంటలకు)

మే 22: గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, అహ్మదాబాద్ (రాత్రి 7:30 గంటలకు)

మే 23: ఆర్‌సీబీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)

మే 24: పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)

మే 25: గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, అహ్మదాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 25: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కేకేఆర్, ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)

మే 26: పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)

మే 27: లక్నో సూపర్ జెయింట్స్ vs ఆర్‌సీబీ, లక్నో (రాత్రి 7:30 గంటలకు)

మే 29: క్వాలిఫయర్ 1 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)

మే 30: ఎలిమినేటర్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)

జూన్ 1: క్వాలిఫయర్ 2 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)

జూన్ 3: ఫైనల్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)

Story first published: Tuesday, May 13, 2025, 9:24 [IST]
Other articles published on May 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+