Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆర్‌సీబీలోకి విధ్వంసకర వికెట్ కీపర్..!

ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీల ఓనర్లతో సమావేశం నిర్వహించి రిటెన్షన్ పాలసీపై వారి అభిప్రాయాలతో పాటు సలహాలు, సూచనలను స్వీకరించింది.

అతి త్వరలోనే బీసీసీఐ రిటెన్షన్ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. అయితే గతంలో జరిగిన మెగా వేలం రిటెన్షన్ పాలసీ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురు కంటే ఎక్కువగా రిటైన్ చేసుకునే అవకాశం లేదు. ఇదే ఫ్రాంచైజీలకు సమస్యగా మారింది. కాంబినేషన్ సెట్ అయిన జట్లు మెగా వేలాన్ని వ్యతిరేకిస్తుండగా.. మిగతా జట్లు కావాలని పట్టుబడుతున్నాయి.

IPL 2025 RCB may target Heinrich Klaasen in mega auction

కొన్ని జట్లు 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా నలుగురు నుంచి ఐదుగురి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం బీసీసీఐ ఇవ్వనుంది. ఈ లెక్కన జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. స్టార్ ఆటగాళ్లంతా తమ పాత జట్లను వీడి కొత్త జట్లలోకి వెళ్లనున్నారు.

ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మెగా వేలంపై ఫోకస్ పెట్టాయి. రిటైన్ చేసుకునే ఆటగాళ్లతో పాటు వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. తమ టీమ్‌ను బలోపేతం చేయడానికి కావాల్సిన ఆటగాళ్ల జాబితాను రూపొందించుకుంటున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కూడా తమ ప్రణాళికలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

గత 17 ఏళ్లుగా ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్‌సీబీ.. ఈసారైన ఆ ముచ్చట తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా విధ్వంసకర వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్‌పై ఆర్‌సీబీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆ జట్టు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. అతన్ని బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. హెన్రీచ్ క్లాసెన్‌ను తీసుకోవడం ద్వారా అటు వికెట్ కీపింగ్‌తో పాటు ఇటు ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ లేని లోటును తీర్చుకోవచ్చనే ఆలోచనలో ఆర్‌సీబీ ఉంది.

గత సీజన్‌లో దారుణంగా విఫలమైన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ వదులుకోనుంది. ఈ క్రమంలోనే హెన్రీచ్ క్లాసెన్ కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం హెన్రీచ్ క్లాసెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ అతన్ని వేలంలోకి వదిలేస్తే మాత్రం.. ఆర్‌సీబీ కోట్లు కుమ్మరించి అయినా దక్కించుకోనుంది.

Story first published: Thursday, August 29, 2024, 17:13 [IST]
Other articles published on Aug 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+