Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ముంబై ఇండియన్స్ ఓటమి.. ఆర్‌సీబీకి గోల్డెన్ ఛాన్స్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో కీలక మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. లక్నో వేదికగా నేడు(మంగళవారం) జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఆర్‌సీబీకి కీలకం. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టాప్-2 ప్లేస్ బెర్త్ ఖరారు కావడంతో పాటు క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తోంది. ఓడితే మాత్రం ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడం ఆర్‌సీబీకి కలిసొచ్చింది. ఈ క్రమంలోనే లక్నోను ఓడించి ఎలాగైనా టాప్-2 ప్లేస్ ఖరారు చేసుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. మరోవైపు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ విజయంతో ఈ సీజన్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో పటిష్ట గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన లక్నో.. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడనుంది. మరోవైపు ఆర్‌సీబీ మాత్రం గెలవాలనే ఒత్తిడితో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

IPL 2025 RCB and LSG Battle for Top-Two Spot

జోష్ హజెల్ వుడ్ రీఎంట్రీ..
ఆర్‌సీబీ స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్ రీఎంట్రీ జట్టుకు కలిసిరానుంది. భుజ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన హజెల్ వుడ్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. అయితే విధ్వంసకర ఫినిషర్ టీమ్ డేవిడ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతను ఈ మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. టీమ్ డేవిడ్‌కు సరిపోయే ఆటగాడు ఆర్‌సీబీకి లేడు. కానీ అతని స్థానంలో లియామ్ లివింగ్ స్టోన్ లేదా జాకోబ్ బెతెల్ స్థానంలో వచ్చిన టీమ్ సీఫెర్ట్‌ను ఆడించవచ్చు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న రజత్ పటీదార్ కేవలం బ్యాటింగ్‌కు పరిమితం కావచ్చు.

ముఖా ముఖి పోరు..
లక్నో, ఆర్‌సీబీ మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు జరగాయి. ఇందులో ఆర్‌సీబీ మూడు సార్లు విజయం సాధించగా.. లక్నో రెండు సార్లు గెలుపొందింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడుతుండటం ఇదే తొలిసారి. గత సీజన్‌లో మాత్రం లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.

తుది జట్లు(అంచనా):
ఆర్‌సీబీ: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, రొమారియో షెపెర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్‌వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్:
మాథ్యూ బ్రిట్జ్‌కే/ఎయిడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెటన్, కీపర్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింఘ్, దిగ్వేష్ రతి, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, విల్ ఓ రూర్కీ, ఆకాశ్ సింగ్.

Story first published: Tuesday, May 27, 2025, 8:07 [IST]
Other articles published on May 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+