For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ధోనీ.. అశ్విన్ ఏమన్నాడంటే..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీని ఆడించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ మాస్టర్ ప్లాన్ రచించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ధోనీని.. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీఎస్‌కే.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కోరినట్లు వార్తలు వచ్చాయి.

గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తయిన ఆటగాళ్లను అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పరిగణించేవాళ్లు. 2021 వరకు ఈ రూల్‌ను కొనసాగించారు. ఆ తర్వాత తొలగించారు. ధోనీ కోసం ఈ రూల్‌ను మళ్లీ అమలు చేయాలని సీఎస్‌కే డిమాండ్ చేసినట్లు.. ఇతర ఫ్రాంచైజీలు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి.

IPL 2025 R Ashwin Says The point is correct On MS Dhoni To Be Potentially Named In Uncapped Category

సరైన వాదనే..
తాజాగా ధోనీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అంశంపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు. ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా పరిగణించడం సరైనదేనన్నాడు. 'ధోనీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా? అనేది పెద్ద ప్రశ్న. కానీ, ఈ వాదన సరైనదే. ఎందుకంటే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలం అవుతోంది.

కాబట్టి అతను అన్‌క్యాప్‌డ్ ప్లేయరే. ధోనీ లాంటి ఆటగాడు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ఆడగలడా? అనేది పక్కనపెడదాం. కానీ ఈ అన్‌క్యాప్‌డ్ అంశం ధోనీతో ముడిపడి ఉండటంతో అందరూ దీని గురించే మాట్లాడుతారు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ధోనీ ఆడుతాడా.?
2020 ఆగస్ట్ 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్‌కే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మెగా వేలం నేపథ్యంలో ఈ సీజన్ ఆడుతాడా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ధోనీ మాత్రం.. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ రిటైన్షన్ రూల్స్ వచ్చిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పాడు.

వ్యతిరేకించిన కావ్య మారన్..
ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా బరిలోకి దించాలనే సీఎస్‌కే వాదనను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి.ఈ రూల్‌ను మళ్లీ తీసుకొచ్చేందుకు ఒప్పుకోమని స్పష్టం చేసింది. ఈ రూల్ వల్ల దిగ్గజ ఆటగాళ్ల విలువను తగ్గించినట్లు అవుతుందని, గొప్ప ఆటగాడైన ధోనీ వేలంలోకి రావాల్సిందేనని స్పష్టం చేసింది.

ఓ అనామక ఆటగాడిని వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసి.. ధోనీ తక్కువ ధరకు రిటైన్ చేసుకోవడం ఏ మాత్రం భావ్యం కాదని అభిప్రాయపడింది. ఐపీఎల్ 2022 మెగా వేలం రూల్స్ ప్రకారం అనామక ప్లేయర్ రిటెన్షన్ ప్రైజ్‌ రూ. 4 కోట్లుగా ఉంది. గత మూడు సీజన్లకు ధోనీ రూ. 12 కోట్లు తీసుకున్నాడు. ఒకవేళ అతను అనామక ప్లేయర్‌గా బరిలోకి దిగితే రూ. 5 కోట్ల కంటే తక్కువ డబ్బులనే తీసుకోవాల్సి ఉంటుంది.

Story first published: Sunday, August 11, 2024, 11:15 [IST]
Other articles published on Aug 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+