ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి నాలుగు ఓవర్లలో కీలకమైన మూడు వికెట్లు పడగొట్టారు. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి ప్రియాన్ష్ ఆర్య(7), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(18), శ్రేయస్ అయ్యర్(2) తీవ్రంగా నిరాశపరిచారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ నిర్లక్ష్యంగా ఔటవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కీలక మ్యాచ్ ఆడుతున్నాననే సోయి లేకుండా అనవసర షాట్‌తో అయ్యర్ పెవిలియన్ చేరాడు. జోష్ హజెల్ వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ నాలుగో బంతిని హజెల్ వుడ్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో వేయగా.. శ్రేయస్ అయ్యర్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ ఎక్స్‌ట్రా బౌన్స్ అయిన బంతి అయ్యర్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ జితేశ్ శర్మ చేతిలో పడింది. దాంతో పంజాబ్ కింగ్స్ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ ఔటైన తీరుపై ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ అమ్మాయి నోరెళ్ల బెట్టింది. 'ఏమైంది రా నీకు'అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ఆమె హవాభావాలు టీవీల్లో కనిపించాయి. సదరు అమ్మాయి హీరోయిన్‌లా ఉండటంతో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ.. పిచ్ నుంచి లభించిన అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంటుంది. యశ్ దయాల్ వేసిన రెండో ఓవర్‌లోనే ప్రియాన్ష్ ఆర్య ఔటవ్వగా.. దూకుడుగా ఆడిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను మరుసటి ఓవర్‌లో భువీ పెవిలియన్ చేర్చాడు. నాలుగో ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్‌ను ఔట్ హజెల్ వుడ్.. ఆరో ఓవర్‌లో జోష్ ఇంగ్లీస్(4)ను ఔట్ చేశాడు. దాంతో పంజాబ్ 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.