ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్లు దుమ్మురేపారు. పిచ్ నుంచి లభించిన అడ్వాంటేజ్‌ను అందిపుచ్చుకున్న ఆర్‌సీబీ బౌలర్లు వరుసగా వికెట్లు తీసారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినీస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మినహా అంతా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/21), సుయాశ్ శర్మ(3/17) మూడేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపెర్డ్‌కు చెరో వికెట్ దక్కింది.
నిప్పులు చెరిగిన ఆర్‌సీబీ బౌలర్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. యష్ దయాల్ వేసిన రెండో ఓవర్‌లోనే ప్రియాన్ష్ ఆర్య(7) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే దూకుడుగా ఆడిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్(18)ను భువనేశ్వర్ కుమార్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. జోష్ హజెల్ వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(2) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. తన మరుసటి ఓవర్‌లో హజెల్ వుడ్.. జోష్ ఇంగ్లీస్(4)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

తిప్పేసిన సుయాశ్ శర్మ..
పవర్ ప్లే అనంతరం నెహాల్ వధేరా(8)ను యశ్ దయాల్ ఔట్ చేయగా.. శశాంక్ సింగ్(3), ఇంపాక్ట్ ప్లేయర్ ముషీర్ ఖాన్(0)లను సుయాశ్ శర్మ ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు మార్కస్ స్టోయినీస్ భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే అతన్ని సుయాశ్ శర్మ క్లీన్ బౌల్డ్ చేసి పంజ్‌ను కోలుకోలేని దెబ్బతీసాడు. 78 పరుగులకే పంజాబ్ 8 వికెట్లు కోల్పోవడంతో 100 పరుగులైనా చేస్తుందా? అనే సందేహం కలిగింది.
అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్ ఆచితూచి ఆడి ఆ దిశగా నడిపించారు. కానీ హర్‌ప్రీత్ బ్రార్(4)ను రొమారియో షెపర్డ్ క్లీన్ బౌల్డ్ చేసి వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. దాంతో 9వ వికెట్‌కు నమోదైన 19 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన కైల్ జెమీసన్ బౌండరీ బాది జట్టు స్కోర్‌ను 100 పరుగులు ధాటించాడు. జోష్ హజెల్ వుడ్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో ఒమర్జాయ్ ఔటయ్యాడు. దాంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.