For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. 18 ఏళ్ల తర్వాత!

పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌(111)ను డిఫెండ్ చేసిన జట్టుగా.. అత్యధిక స్కోర్‌(262)ను ఛేదించిన టీమ్‌గా రికార్డ్ సాధించింది. ఈ రెండు రికార్డులను కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)పైనే పంజాబ్ కింగ్స్ నెలకొల్పడం విశేషం. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో 16 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా పంజాబ్ కింగ్స్ ఈ ఫీట్ సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రియాంశ్ ఆర్య(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా(3/25) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్2/14), వరుణ్ చక్రవర్తీ(2/21) రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ పడగొట్టారు.

IPL 2025 Punjab Kings creates history with sensational win over KKR

అనంతరం కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌటైంది. అంగ్‌క్రిష్ రఘువంశీ(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37), ఆండ్రీ రస్సెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 17 ) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో(4/28) నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్(3/17)మూడు వికెట్లు పడగొట్టాడు. గ్జెవియర్ బార్ట్‌లెట్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసారు.

16 ఏళ్ల రికార్డ్ బద్దలు..
తాజా విజయంతో పంజాబ్ కింగ్స్ 16 ఏళ్ల ఐపీఎల్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. 2009లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 116/9 స్కోర్‌ను డిఫెండ్ చేసుకుంది.

ఐపీఎల్‌లో డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్లు..

111 - పీబీకేఎస్ వర్సెస్ కేకేఆర్, ముల్లాన్‌పూర్, 2025
116/9 - సీఎస్‌కే వర్సెస్ పీబీకేఎస్, డర్బన్, 2009
118 - ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఎంఐ, ముంబై వాంఖడే, 2018
119/8 - పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ, డర్బన్, 2009
119/8 - ఎస్‌ఆర్‌హెచ్ vs పీడబ్ల్యూఐ, పూణే, 2013

గతేడాది కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక రన్ ఛేజ్‌గా నిలిచింది.

Story first published: Wednesday, April 16, 2025, 0:34 [IST]
Other articles published on Apr 16, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+