ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన కేకేఆర్.. 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడోసారి టైటిల్‌ను ముద్దాడింది. అప్‌కమింగ్ ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ అదే తరహా ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో ఉంది. మెంటార్‌గా కేకేఆర్‌ను విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికవ్వడంతో అతని స్థానాన్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గంభీర్‌తో పాటు కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కాటేలు కూడా టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో చేరారు. అంతేకాకుండా ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే టీమ్ కొత్త మెంటార్‌ను నియమించడంపై కేకేఆర్ ఫోకస్ పెట్టింది. ఈ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది.

మెంటార్‌గా పాంటింగ్..
ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో పాటు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, సౌతాఫ్రికా లెజెండ్ జాక్వస్ కల్లీస్ పేర్లను కేకేఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన రికీ పాంటింగ్‌ను ఇటీవలే ఆ జట్టు వదులుకుంది. దాంతో పాంటింగ్‌ను తమ మెంటార్‌గా నియమించుకునేందుకు కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్‌గా ఉన్న కుమార సంగక్కర కూడా ఆ జట్టును వీడే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాహుల్ ద్రవిడ్‌ను రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమించింది. దాంతో సంగక్కర తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కెప్టెన్‌గా సూరీడు..
తమ కెప్టెన్‌ను కూడా మార్చే యోచనలో కేకేఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్‌ను వదిలేసి తమ మాజీ ప్లేయర్, ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడంతో ముంబై ఇండియన్స్‌లో కొనసాగేందుకు సూర్య సుముఖంగా లేనట్లునిపిస్తోంది.
కెప్టెన్సీ ఆఫర్ చేసిన జట్టులోకి వెళ్లాలని సూర్య నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఒకవేళ సూర్య వేలంలోకి వచ్చినా.. ట్రేడింగ్‌కు ఒప్పుకున్నా తీసుకొని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
శ్రేయస్ అయ్యర్ దూరం..
ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్‌కు టైటిల్ అందించిన రెండో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. గౌతమ్ గంభీర్ తర్వాత అతనే మూడో టైటిల్ గెలిచాడు. అయితే శ్రేయస్ అయ్యర్‌ను వదులుకునేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ తమ జట్టులోకి వస్తానంటే అతనికి బదులుగా శ్రేయస్ అయ్యర్‌ను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చుకునేందుకు కూడా కేకేఆర్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం.