Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 ప్లే ఆఫ్స్ ఛాన్స్.. SRH, CSK, RR ఔట్! డేంజర్‌ జోన్‌లో ముంబై, లక్నో!

ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశకు చేరుకుంది. ప్రతీ జట్టు ఇప్పటికే 8 నుంచి 9 మ్యాచ్‌లు ఆడేసాయి. ఇంకా ఒక్కో జట్టు 6 నుంచి 5 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాయి. ఇక నుంచి ఈ టోర్నీలో జరిగే ప్రతీ మ్యాచ్‌ ప్లే ఆఫ్స్ చేరే జట్లపై ప్రభావం చూపనుంది. ఆర్‌సీబీ- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్, ఎస్‌ఆర్‌హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరే జట్ల అవకాశాలను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్, సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ దాదాపుగా రేసు నుంచి తప్పుకున్నాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్ డేంజర్ జోన్‌లో ఉన్నాయి.

IPL 2025 Playoffs Qualification Chances after RCB vs RR Match 42

జట్ల వారీగా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏంటంటే..?

1.గుజరాత్ టైటాన్స్..
ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 6 విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతోంది. గుజరాత్ రన్ రేట్(1.104) కూడా మెరుగ్గానే ఉంది. గుజరాత్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 90 శాతంగాగా ఉంది.

2. ఢిల్లీ క్యాపిటల్స్
ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే ఢిల్లీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతోంది. ఢిల్లీ రన్ రేట్(0.657) కూడా మెరుగ్గానే ఉంది. గుజరాత్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 84 శాతంగా ఉంది.

3.ఆర్‌సీబీ
ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ 6 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే ఆర్‌సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ఆర్‌సీబీ రన్ రేట్(0.482)తక్కువగా ఉంది. ఆర్‌సీబీకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 75 శాతంగా ఉంది.

4. ముంబై ఇండియన్స్..

ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 5 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు విజయాలు సాధిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతుంది. ముంబై రన్ రేట్(0.673)మెరుగ్గానే ఉంది. ముంబైకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 48 శాతంగా ఉంది. ఆ జట్టు తర్వాతి మ్యాచ్‌ల్లో పటిష్టమైన జట్లతో తలపడాల్సి ఉంది. అయితే ఆ జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా విజయం సాధించింది.

5. పంజాబ్ కింగ్స్..

ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ 5 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే పంజాబ్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. పంజాబ్ రన్ రేట్(0.177)తక్కువగానే ఉంది. పంజాబ్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 56 శాతంగా ఉంది.

6.లక్నో సూపర్ జెయింట్స్

ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ 5 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు విజయాలు సాధిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. లక్నో రన్ రేట్(-0.054)మెరుగ్గా లేదు. లక్నో ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 31 శాతంగా ఉంది.

7. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)
ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఐదు విజయాలు సాధిస్తేనే కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ రన్ రేట్(-0.212)తక్కువగానే ఉంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 13 శాతంగా ఉంది.

8.రాజస్థాన్ రాయల్స్

ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 2 విజయాలతో 8వ స్థానంలో కొనసాగుతుంది. దాదాపు రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌లకు ఐదు గెలిచినా.. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరలేదు. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్(-0.625)మెరుగ్గా లేదు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 1.8 శాతంగా ఉంది.

9. సన్‌రైజర్స్ హైదరాబాద్

ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 విజయాలతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఆరెంజ్ ఆర్మీ ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు ఓడితే అధికారికంగా నిష్క్రమిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్ రేట్(-1.361)మెరుగ్గా లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 1 శాతంగా ఉంది.

10. చెన్నై సూపర్ కింగ్స్

ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 2 విజయాలతో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. ఎల్లో ఆర్మీ ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు ఓడితే అధికారికంగా నిష్క్రమిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ రన్ రేట్(-1.392)మెరుగ్గా లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 0.2 శాతంగా ఉంది.

Story first published: Friday, April 25, 2025, 12:34 [IST]
Other articles published on Apr 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+