Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 వేలంలోకి బిగ్ స్టార్స్.. 10 ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రిటెన్షన్ జాబితాలు విడుదలయ్యాయి. రిటెన్షన్ జాబితాల సమర్పణకు గురువారంతో గడువు ముగియడంతో ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలు 10 జట్ల రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. ఒక్కో జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, విడుదల చేసిన ప్లేయర్ల వివరాలను వెల్లడించాయి.

అందరూ ఊహించినట్లుగానే రిటెన్షన్ జాబితాలున్నాయి. స్టార్ ఆటగాళ్లు.. గత సీజన్లలో సారథులుగా వ్యవహరించిన రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ మెగా వేలంలోకి రాగా.. రూ. 24.75 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్ ధర పలికిన మిచెల్ స్టార్క్‌ను కూడా కేకేఆర్ వదిలేసింది. రిటెన్షన్ ప్రక్రియలో అత్యధిక ధర సొంతం చేసుకున్న భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతన్ని ఆర్‌సీబీ రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. కేకేఆర్ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ ఇదర్ని మాత్రమే అట్టిపెట్టుకుంది. 10 జట్ల రిటెన్షన్ జాబితాలపై ఓ లుక్కెయ్యంది.

IPL 2025 Player Retention List Each Team Retentions Ahead Of Mega Auction

1. గుజరాత్ టైటాన్స్

శుభ్‌మన్ గిల్-రూ. 16.5 కోట్లు

రషీద్ ఖాన్-రూ. 18 కోట్లు

సాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లు

రాహుల్ తెవాటియా-రూ. 4 కోట్లు

షారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లు

2. లక్నో సూపర్ జెయింట్స్

నికోలస్ పూరన్-రూ. 21 కోట్లు

రవి బిష్ణోయ్-రూ. 11 కోట్లు

మయాంక్ యాదవ్-రూ. 11 కోట్లు

మోహ్‌సిన్ ఖాన్- రూ. 4 కోట్లు

ఆయుష్ బదోని-రూ. 4 కోట్లు

3. ముంబై ఇండియన్స్

జస్‌ప్రీత్ బుమ్రా-రూ. 18 కోట్లు

సూర్యకుమార్ యాదవ్-రూ. 16.35 కోట్లు

హార్దిక్ పాండ్యా-రూ. 16.35 కోట్లు

రోహిత్ శర్మ-రూ. 16.30 కోట్లు

తిలక్ వర్మ-రూ. 8 కోట్లు

4. చెన్నై సూపర్ కింగ్స్

మహేంద్ర సింగ్ ధోనీ-రూ. 4 కోట్లు

రుతురాజ్ గైక్వాడ్-రూ.18 కోట్లు

రవీంద్ర జడేజా-రూ. 18 కోట్లు

మతీష పతీరణ-రూ. 13 కోట్లు

శివమ్ దూబే-రూ. 12 కోట్లు

5. సన్‌రైజర్స్ హైదరాబాద్

హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు

ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు

అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు

ట్రావిస్ హెడ్- రూ. 14 కోట్లు

నితీశ్ కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లు

6. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ- రూ. 21 కోట్లు

రజత్ పటీదార్-రూ. 11 కోట్లు

యశ్ దయాల్-రూ. 5 కోట్లు

7.ఢిల్లీ క్యాపిటల్స్

అక్షర్ పటేల్-రూ. 16.5 కోట్లు

కుల్దీప్ యాదవ్-రూ. 13.25 కోట్లు

ట్రిస్టన్ స్టబ్స్-రూ. 10 కోట్లు

అభిషేక్ పోరెల్-రూ. 4 కోట్లు

8.కేకేఆర్

రింకూ సింగ్-రూ. 13 కోట్లు

వరుణ్ చక్రవర్తీ- రూ. 12 కోట్లు

సునీల్ నరైన్-రూ. 12 కోట్లు

ఆండ్రీ రస్సెల్-రూ. 12 కోట్లు

హర్షిత్ రాణా-రూ. 4 కోట్లు

రమణ్‌దీప్ సింగ్-రూ. 4 కోట్లు

9. పంజాబ్ కింగ్స్

శశాంక్ సింగ్-రూ. 5.5 కోట్లు

ప్రభ్‌సిమ్రాన్ సింగ్- రూ. 4 కోట్లు

10. రాజస్థాన్ రాయల్స్

సంజూ శాంసన్-రూ. 18 కోట్లు

యశస్వి జైస్వాల్-రూ. 18 కోల్లు

రియాన్ పరాగ్-రూ. 14 కోట్లు

ధ్రువ్ జురెల్-రూ. 14 కోట్లు

షిమ్రాన్ హెట్‌మైర్-రూ. 11 కోట్లు

సందీప్ శర్మ-రూ. 4 కోట్లు

Story first published: Thursday, October 31, 2024, 19:44 [IST]
Other articles published on Oct 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+