ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశించింది.
అంతేకాకుండా అదే రోజు (అక్టోబర్ 31(గురువారం)) సాయంత్రం 5 గంటల నుంచి ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమా.. రిటెన్షన్ జాబితాలను అధికారికంగా ప్రకటించనున్నాయి. అయితే ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది. 10 ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్‌లను అంచనా వేసింది.

ముంబై ఇండియన్స్‌లోనే రోహిత్ శర్మ కొనసాగగా.. మహేంద్ర సింగ్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడాడని, వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయని ప్రచారం జరుగుతోంది. 10 ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ అంచనాపై ఓ లుక్కెయ్యండి.
1. గుజరాత్ టైటాన్స్
శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తేవాటియా(ఆర్‌టీఎమ్)
2. లక్నో సూపర్ జెయింట్స్
నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్(ఆర్‌టీఎమ్)
3. ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ
4. చెన్నై సూపర్ కింగ్స్
మహేంద్ర సింగ్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, మతీష పతీరణ
5. సన్‌రైజర్స్ హైదరాబాద్
ప్యాట్ కమిన్స్, హెన్రీచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అబ్దుల్ సమద్
6. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్
7.ఢిల్లీ క్యాపిటల్స్
రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్
8.కేకేఆర్
సునీల్ నరైన్, రెహ్మనుల్లా గుర్జాజ్, రింకూ సింగ్, హర్షిత్ రాణా
9. పంజాబ్ కింగ్స్
అర్ష్‌దీప్ సింగ్, లియామ్ లివింగ్ స్టోన్, సామ్ కరణ్
10. రాజస్థాన్ రాయల్స్
సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్.