Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs MI Qualifier 2 అంతరాయం.. మోదీ స్టేడియంలో భారీ వర్షం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య జరగాల్సిన క్వాలిఫయర్-2‌కు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికే భారీ వర్షం రావడంతో మైదానాన్ని కవర్లతో కప్పేసారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడినని తెలిపాడు.

ఇరు జట్లలో ఒక్కో మార్పు చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌లోకి యుజ్వేంద్ర చాహల్ రీఎంట్రీ ఇవ్వగా.. ముంబై ఇండియన్స్ జట్టులోకి రీస్ టోప్లీ వచ్చాడు. రిచర్డ్ గ్లీసన్ గాయపడటంతో టోప్లీకి అవకాశం దక్కింది.

IPL 2025 PBKS vs MI Qualifier 2 Start delayed due to rain

క్వాలిఫయర్-2 మ్యాచ్ కోసం రిజర్వ్ డే లేదు. కాకపోతే కటాఫ్ టైమ్‌ను అదనంగా గంటవరకు పొడిగించారు. ఈ లెక్కన అర్థరాత్రి 12 గంటల వరకు అంపైర్లు వేచిచూస్తారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఇరు జట్లు 5 ఓవర్లు ఆడితేనే ఫలితం తేలుతోంది. లేదంటే టోర్నీ నిబంధనల ప్రకారం పాయింట్స్ టేబుల్‌లో మెరుగైన ర్యాంక్‌లో ఉన్న జట్టు టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఈ లెక్కన పంజాబ్‌ కింగ్స్ ఫైనల్ చేరుతోంది. మ్యాచ్ జరగాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తుది జట్లు
పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జేమీసన్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్ష్ దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ.

Story first published: Sunday, June 1, 2025, 19:50 [IST]
Other articles published on Jun 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+