For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమ్మో.. మా వాళ్ల‌కు అస్సలు బౌలింగ్ చేయను: ప్యాట్ కమిన్స్

తమ బ్యాటర్లకు అస్సలు బౌలింగ్ చేయనని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వారి బ్యాటింగ్ భీభత్సంగా ఉందని, వారిని ఎదుర్కోవడం బౌలర్లకు కష్టంగా మారిపోయిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. గత సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్‌ చిత్తు చేసింది. ఆదివారం ఉప్పల్ వేదికగా సిక్సర్ల వర్షం కురిసిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయం స్పందించిన ప్యాట్ కమిన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అదే సమయంలో ఓ బౌలర్‌గా వారికి బౌలింగ్ చేయాలంటే భయంగా ఉందని తెలిపాడు. ఎట్టి పరిస్థితుల్లో వారికి బౌలింగ్ చేయనని నవ్వులు పూయించాడు.

IPL 2025 Pat Cummins Says I wouldn t be wanting to bowl to our boys after SRH beat RR

'నేను ఎట్టిపరిస్థితుల్లో మా కుర్రాళ్లకు బౌలింగ్ చేయను. వారి బ్యాటింగ్ అసాధారణం.. భీభత్సం. మేం 280 పరుగుల చేయడం నమ్మశక్యం కానిది. బౌలర్లకు ఇది చాలా కష్టంగా ఉంటుంది. కానీ భారీ స్కోర్ చేసినప్పుడు ఒక్క ఓవర్ కట్టడిగా వేసినా విజయం దక్కుతుంది. మేం మా కోర్ టీమ్‌ను అలాగే ఉంచుకున్నాం. ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. స్వేచ్చగా ఆడటానికి ప్రయత్నించాడు. ఈ సీజన్ కోసం మేం అద్భుతంగా సన్నదమయ్యాం. మా కోచ్‌ల పని తీరు కూడా అమోఘం. ఈ మ్యాచ్‌తో ఈ ఏడాది మిగిలిన ఆట ఎలా ఆడాలో మా కుర్రాళ్లు ఓ బ్లూ ప్రింట్ రూపొందించారు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

ఇషాన్ కిషన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 నాటౌట్), ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67) విధ్వంసంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 30 సిక్సర్లు, 51 ఫోర్లు నమోదయ్యాయి.

Story first published: Sunday, March 23, 2025, 20:28 [IST]
Other articles published on Mar 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+