ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్‌పై అవగాహన లేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ కండిషన్స్‌పై అవగాహన లేనప్పుడు చేజింగ్ చేయడం ఉత్తమం. ఈ సీజన్‌లో మేం మా సామర్థ్యానికి తగ్గట్లు ఆడలేదు. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా మా సామర్థ్యం మేరకు ఆడాలనుకుంటున్నాం. జట్టులో కొంతమంది గాయపడ్డారు.
అయినా జట్టు గొప్పగానే ఉంది. అత్యుత్తమ ప్రదర్శన చేయలేదని మా ఆటగాళ్లందరూ ఒప్పుకున్నారు. బెంచ్‌పై మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో జయదేవ్ ఉనాద్కత్ కూడా ఆడటం లేదు. హర్ష్ దూబే, అథర్వ టైడ్ తుది జట్టులోకి వచ్చారు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. కరోనా బారిన పడటంతో ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. వ్యక్తిగత కారణాలతో జయదేవ్ ఉనాద్కత్ ఆడటం లేదు.

మరోవైపు టాస్‌తో తమకు సంబంధం లేదని, ముందు బ్యాటింగ్ అయినా సరేనని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. 'ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేం మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. మేం ఒక్కో మ్యాచ్ గెలవడంపై ఫోకస్ పెట్టాం. ప్లే ఆఫ్స్ గురించి ఆలోచించి ఒత్తిడికి గురవ్వాలనుకోవడం లేదు. ఓ జట్టుగా మేం మెరుగైన స్థితిలో నిలిచాం. తుది జట్టులో ఒకే ఒక మార్పు చేశాం. విల్ ఓ రూర్కీ అరంగేట్రం చేస్తున్నాడు.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కీపర్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కీ
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ.