Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs SRH: అందుకే తుది జట్టులో మార్పులు చేయలేదు: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. కొన్నిసార్లు రాత్రి వేళలో బ్యాటింగ్ చేయడం ఉత్తమం. సీఎస్‌కేపై మేం విజయం సాధించాం. ఇంకా మాకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో మేం మెరుగైన ప్రదర్శన చేశాం. ఈ రోజు కూడా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. ఇక్కడ ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లోనూ మేం ముందుగా బ్యాటింగ్ చేశాం. ఈ సీజన్ మాకు సానుకూలంగా సాగింది. జట్టు బాగుంది. మేం నెట్‌రన్‌రేట్‌పై ఫోకస్ పెట్టడం లేదు. ప్రతీ మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. కరీమ్ జనత్ స్థానంలో గెరాల్డ్ కోయిట్జీ తుది జట్టులోకి వచ్చాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

IPL 2025 Pat Cummins Reveals The Reason Why SRH Playing XI Unchanged vs GT Match

ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలకం. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తయిన గుజరాత్ టైటాన్స్.. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటుంది.

తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ.

Story first published: Friday, May 2, 2025, 19:16 [IST]
Other articles published on May 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+