Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆ రూల్‌తో నాకేమీ ఇబ్బంది లేదు.. నేను ఎప్పుడూ అలా చేయలేదు: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు మధ్యలో తప్పుకోకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కఠిన రూల్‌ను తీసుకొచ్చింది. వేలంలో అమ్ముడైన తర్వాత వ్యక్తిగత కారణాలు చూపుతూ టోర్నీ నుంచి తప్పుకుంటే.. తదుపరి రెండు సీజన్లలో పాల్గొనకుండా నిషేధం విధించేలా బీసీసీఐ నయా రూల్ తీసుకొచ్చింది.

సహేతుకమైన కారణం చూపితేనే ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించనుంది.
గతంలో వేలంలో తక్కువ ప్రైజ్ దక్కిందని కొందరు ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకున్నారు. దీని వల్ల ఫ్రాంచైజీలు నష్టపోయాయి. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసేందుకు బీసీసీఐ కఠిన రూల్ తీసుకొచ్చింది. ఈ నిబంధనపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఈ నిబంధనతో తనకు వచ్చిన సమస్య ఏం లేదన్నాడు. తాను ఎప్పుడూ అలా చేయలేదని స్పష్టం చేశాడు.

IPL 2025 Pat Cummins reacts on BCCI s new rule to ban overseas players for two years from IPL

'ఐపీఎల్ 2025 సీజన్ గురించి ఎలాంటి వర్కౌట్ చేయలేదు. ఆ టోర్నీ ఇంకా చాలా సమయం ఉంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకొచ్చిన నయా రూల్స్ బాగానే ఉన్నాయి. వాటితో నాకు వచ్చిన సమస్య ఏం లేదు. నాపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే వేలంలో పాల్గొన్న తర్వాత నేనెప్పుడూ అందుబాటులో లేకుండా లేను.

అయితే ఐపీఎల్ కంటే టెస్ట్ క్రికెట్, మెగా టోర్నీలకే నా తొలి ప్రాధాన్యత. అవి ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. అప్‌కమింగ్ సీజన్ కోసం ఏం చేయాలనేదానిపై వేచి చూస్తున్నాం. నేనైతే అన్నింటిని సమన్వయం చేయగలనని అనుకుంటున్నా'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2025 రిటెన్షన్‌కు సంబంధించిన రూల్స్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31లోపు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలను ఆదేశించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి ఆటగాడిగా ప్యాట్ కమిన్స్‌ను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది.

Story first published: Saturday, October 12, 2024, 13:06 [IST]
Other articles published on Oct 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+