Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs DC: నిప్పులు చెరిగిన ప్యాట్ కమిన్స్.. సంతోషంలో కావ్య పాప!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3/19) నిప్పులు చెరిగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(36 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్), అషుతోష్ శర్మ(26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కమిన్స్‌కు తోడుగా.. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసారు. ప్యాట్ కమిన్స్ సంచలన ప్రదర్శనతో సన్‌రైజర్స్ టీమ్ ఓనర్ కావ్య మారన్ సంతోషంతో ఎగిరి గంతేసింది. ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ ప్రదర్శనను తెగ ఆస్వాదించింది.

IPL 2025 Pat Cummins 3 wickets helped SRH restrict DC to 133 7
Photo Credit: screen grab for JioHotstar

ఢిల్లీ చెత్త రికార్డ్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే కరుణ్ నాయర్‌(0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన ప్యాట్ కమిన్స్.. తన మరుసటి ఓవర్ ఫస్ట్ బాల్‌కు ఫాఫ్ డుప్లెసిస్(3)ను ఔట్ చేశాడు. మూడో ఓవర్ తొలి బంతికి అభిషేక్ పోరెల్‌(8)ను పెవిలియన్ చేర్చాడు. ఈ ముగ్గుర్ని కమిన్స్.. కీపర్ క్యాచ్‌గానే పెవిలియన్ చేర్చడం గమనార్హం. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న కమిన్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్‌(6)ను హర్షల్ పటేల్‌ ఔట్ చేయడంతో పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 26 పరుగులే చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే అత్యల్ప పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం.

అనవసర రనౌట్..
పవర్ ప్లే అనంతరం కేఎల్ రాహుల్(10)ను జయదేవ్ ఉనాద్కత్ ఔట్ చేయడంతో ఢిల్లీ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆచితూచి ఆడిన ఈ ఇద్దరూ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. 33 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీ.. అనవసర తప్పిదంతో మూల్యం చెల్లించుకుంది. సమన్వయ లోపంతో విప్రజ్ నిగమ్(18) రనౌట్‌గా వెనుదిరిగాడు. విప్రజ్ చెప్పిన వినకుండా రెండో పరుగుకు పరుగెత్తిన ట్రిస్టన్ స్టబ్స్‌ అతని ఔట్‌కు కారణమయ్యాడు.

ఆదుకున్న స్టబ్స్, అషుతోష్ శర్మ
ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అషుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ ఓవర్లు అయిపోవడంతో.. ఈ ఇద్దరూ బ్యాటర్లు స్వేచ్చగా ఆడారు. జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్‌లను టార్గెట్ చేసి పరుగులు రాబట్టారు. దాంతో 100 పరుగులైనా చేస్తుందా? అనిపించిన ఢిల్లీ 133 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది.

Story first published: Monday, May 5, 2025, 21:27 [IST]
Other articles published on May 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+