Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషభ్ పంత్ గుడ్‌బై.. రిటెన్షన్ లిస్ట్ ఇదే!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశించింది. అంతేకాకుండా అదే రోజు (అక్టోబర్ 31(గురువారం)) సాయంత్రం 5 గంటల నుంచి ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమా.. రిటెన్షన్ జాబితాలను అధికారికంగా వెల్లడించనున్నాయి.

మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలనే నిబంధన పెట్టింది. ఈ ఆరుగురి ఆటగాళ్లను నేరుగా లేదా వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్‌తో తిరిగి కొనుగోలు చేయవచ్చు. నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

IPL 2025 No Rishabh Pant as Delhi Capitals finalise their retained players

నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీకి రిషభ్ పంత్ గుడ్‌బై
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. అతన్ని జట్టులో కొనసాగించేందుకు ఢిల్లీ మేనేజ్‌మెంట్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోచ్ మార్పు, సాలరీ క్యాప్ విషయంలో రిషభ్ పంత్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇటీవలే రిషభ్ పంత్.. వేలంలోకి వస్తే ఎవరైనా కోనుగోలు చేస్తారా? ఎంత ధర పలుకుతారా? అంటూ ట్వీట్ చేశాడు.

అప్పట్లో ఈ ట్వీట్‌ను అంతా జోక్‌గా తీసుకున్నారు. రిషభ్ పంత్.. పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే ఛాన్స్ ఉంది. ఆర్‌సీబీతో పాటు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కేకేఆర్ తదితర జట్లు పోటీ పడనున్నాయి. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ బాధ్యతలు స్వీకరించడంతో ఆ జట్టులోకే వెళ్లేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

అతను ఈజీగా రూ. 25-30 కోట్ల వరకు పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. జట్టు నుంచి రిషభ్ పంత్ తప్పుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, October 30, 2024, 20:34 [IST]
Other articles published on Oct 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+