Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: పృథ్వీ షాకు నో ఛాన్స్.. ఆ ముగ్గురినే రిటైన్ చేసుకోనున్న ఢిల్లీ క్యాపిటల్స్!

ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశించింది. నవంబర్ 30న మెగా వేలం నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ప్రకటటించింది.

ప్రతీ జట్టుకు ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలనే నిబంధన పెట్టింది. విదేశీ ఆటగాళ్లపై ఎలాంటి పరిమితి విధించలేదు. ఆరుగురి ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా వేలంలో తిరిగి కొనుగోలు చేయవచ్చు.

IPL 2025 No Prithvi Shaw Delhi Capitals Likely To Retain These 3 Players Before Mega-Auction

రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లు చెల్లించాలి. ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. బీసీసీఐ సెక్రటరీగా జై షా ఉండగానే మెగా వేలాన్ని పూర్తి చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే బీసీసీఐకి సమర్పించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఆ కథనం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్‌తో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వరుసగా, తొలి, రెండో, మూడో ప్లేయర్‌గా రిటైన్ చేసుకోనుంది.

రిషభ్ పంత్‌కు రూ18 కోట్లు, అక్షర్ పటేల్‌కు రూ. 14 కోట్లు, కుల్దీప్ యాదవ్‌కు రూ. 11 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ చెల్లించనుంది. ఐపీఎల్ 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన రిషభ్ పంత్.. నిలకడగా రాణిస్తూ కెప్టెన్ అయ్యాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో ఒక సీజన్ మొత్తానికి దూరమైనా.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఇషాన్ కిషన్ చెలరేగాడు.

పృథ్వీ షాకు నో ఛాన్స్..
వెటరన్ ఓపెనర్ పృథ్వీ షాను వేలంలోకి వదిలేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ రెడీ అయ్యింది. 2018 నుంచి ఆ జట్టుకు ఆడుతున్న పృథ్వీ షా.. ఐపీఎల్ 2024 సీజన్‌లో విఫలమయ్యాడు. దాంతో అతనిపై ఢిల్లీ మేనేజ్‌మెంట్ వేటు వేసేందుకు సిద్దమైంది.

Story first published: Wednesday, October 16, 2024, 21:59 [IST]
Other articles published on Oct 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+