ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) ప్రకటించింది. అనూహ్యంగా మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను తీసుకునేందుకు అవకాశం కల్పించింది.
విదేశీ ఆటగాళ్ల రిటెన్షన్‌పై ఎలాంటి పరిమితి విధించలేదు. టీమ్ పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. ఆరుగురి ఆటగాళ్లను నేరుగా రిటైన్ అయినా చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా అయినా తీసుకోవచ్చు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాలి.

అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది. దాంతో ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ లిస్ట్‌పై ఫోకస్ పెట్టాయి. విదేశీ ఆటగాళ్ల రిటెన్షన్‌పై పరిమితి విధించవద్దని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ చేసిన రిక్వెస్ట్‌ను బీసీసీఐ పరిగణలోకి తీసుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం జరగనుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా ఆటగాళ్లను రిటైన్ చేసుకోనుంది. టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను తొలి ఆటగాడిగా రూ. 18 కోట్లకు అట్టిపెట్టుకోనుంది. టీమ్ కెప్టెన్‌గా... బౌలర్‌గా.. బ్యాటర్‌గా ప్యాట్ కమిన్స్ సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నాడు.
రెండో ప్లేయర్‌గా విధ్వంసకర బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్‌ను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకోవచ్చు.
అయితే రెండో ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ వేలంలో అతను రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ధర పలికే అవకాశం లేదు కాబట్టి అతని కోసం రిటెన్షన్ కార్డ్ ఉపయోగించవచ్చు. మూడో ప్లేయర్‌గా రూ. 11 కోట్లు విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోనుంది. ట్రావిస్ హెడ్‌తో పాటు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కోసం ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించనున్నారు. ఈ ఇద్దరిని రూ. 25 కోట్లలోపు తీసుకోవాలనే కావ్య మారన్ వ్యూహం.
ముగ్గురు ప్లేయర్లను నేరుగా.. మరో ముగ్గురి కోసం రిటెన్షన్ కార్డ్ వాడుకోవచ్చు. వేలంలో భారీ డబ్బుతో బరిలోకి దిగాలనేది సన్‌రైజర్స్ వ్యూహం.
సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్ ఇదే..!
1. ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు
2.హెన్రీచ్ క్లాసెన్-రూ. 14 కోట్లు
3. అభిషేక్ శర్మ- రూ. 11 కోట్లు
4. నితీష్ కుమార్ రెడ్డి- ఆర్‌టీఎమ్
5.ట్రావిస్ హెడ్-ఆర్‌టీఎమ్