Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH కొంపముంచిన నితీష్ కుమార్ రెడ్డి జిడ్డు బ్యాటింగ్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ సీజన్‌ను ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రెండో మ్యాచ్‌లోనే బిగ్ షాక్ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ పరాజయం సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. 300 పక్కా అంటూ ధీమా వ్యక్తం చేసిన ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు.. ఈ పరాజయంతో వాస్తవం తెలిసొచ్చింది.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా నిరాశపరిచాడు. అతని వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమైన నితీష్ కుమార్ రెడ్డి.. జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులను విసిగించాడు. 28 బంతులాడి 2 ఫోర్లతో 32 పరుగులే చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై నితీష్ కుమార్ రెడ్డి స్లో బ్యాటింగ్.. అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

IPL 2025 Nitish Kumar Reddy s Slow Batting Cost SRH against LSG

ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో ట్రావిస్ హెడ్‌తో కలిసి యాంకర్ రోల్ పోషించిన నితీష్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత దూకుడుగా ఆడలేకపోయాడు. చెత్త షాట్‌తో డేంజరస్ హెన్రీచ్ క్లాసెన్‌ రనౌట్‌కు కారణమయ్యాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ బౌలర్ చేతుల్లో నుంచి జారి నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకింది. దాంతో క్లాసెన్(26) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ కాసేపటికే రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతని స్ట్రైక్‌రేట్ 114.28గానే ఉండటం గమనార్హం.

తన ప్రదర్శన పట్ల తీవ్ర అసహనానికి గురైన నితీష్ కుమార్ రెడ్డి.. పెవిలియన్ చేరిన తర్వాత తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. తన వల్లే మ్యాచ్ ఓడిపోతుందనే బాధను నితీష్ కుమార్ రెడ్డి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ కూడా నితీష్ కుమార్ రెడ్డి జిడ్డు బ్యాటింగ్ కారణంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిందని కామెంట్ చేస్తున్నారు.

{embed-poll}

{quiz_2245}

Story first published: Friday, March 28, 2025, 10:58 [IST]
Other articles published on Mar 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+