Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: డబ్బుదేం ఉందన్నా.. SRHలో తప్పా వేరే జట్టులో ఆ ఫీల్ రాదు: నితీష్‌కుమార్ రెడ్డి (వీడియో)

ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొంటే భారీ ధర దక్కేదని జరుగుతున్న ప్రచారంపై టీమిండియా నయా ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి స్పందించాడు. డబ్బు పెద్ద విషయం కాదని, ఈ రోజు కాకపోతే మరో రోజు వస్తుందని తెలిపాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడటం వల్లే తాను టీమిండియాకు ఎంపికయ్యానని గుర్తు చేశాడు. తెలుగు ప్లేయర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడితేనే తెలుగు వారు ఆనందిస్తారని, మరో జట్టుకు ఆడితే ఆ ఫీలింగ్ రాదని బదులిచ్చాడు.

IPL 2025 Nitish Kumar Reddy Reveals Why He Accept SRH Retention at Just 6 Crore

రూ.6 కోట్లకే..
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 6 కోట్లకే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. రిటెన్షన్ ఒప్పుకోకుండా మెగా వేలంలోకి వచ్చి ఉంటే ఈ తెలుగు ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడేవి. సునాయసంగా అతను రూ. 15 నుంచి 20 కోట్లు పలికేవాడని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా. కానీ నితీష్ కుమార్ రెడ్డి డబ్బుకు ఆశపడకుండా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కొనసాగేందుకే మొగ్గు చూపాడు.

తాజాగా ప్రముఖ తెలుగు కామెంటేటర్ కౌశిక్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించగా.. నితీష్ కుమార్ రెడ్డి హార్ట్ టచింగ్ కామెంట్స్ చేశాడు.

ఇంత పెద్ద మాటలు ఎలా..?
ఈ ఇంటర్వ్యూలో 'ఒకవేళ ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి నితీష్ కుమార్ రెడ్డి వెళ్తే బాగా డబ్బులు వస్తాయని అంతా అనుకున్నాం. కానీ మీరు సన్‌రైజర్స్‌లో కొనసాగేందుకు చెప్పిన కారణం బాగా నచ్చింది. చాలా గర్వంగా అనిపించింది. నా ఫస్ట్ టీమ్ సన్‌రైజర్స్. వాళ్లు నాకు తొలి అవకాశం ఇచ్చారు. నేను డబ్బుల కోసం చూడటం లేదని బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇలా చెప్పాలనే ఆలోచన ఎలా వచ్చింది?'అని నితీష్ కుమార్ రెడ్డిని కౌశిక్ ప్రశ్నించాడు.

మన తెలుగోడు ఆడుతున్నాడని...
అందుకు నితీష్ తనదైన శైలిలో స్పందించాడు. 'నేను ఇండియాకు ఆడుతున్నానంటే దానికి ప్రధాన కారణం సన్‌రైజర్స్ హైదరాబాద్. సన్‌రైజర్స్‌లో రాణించడం వల్లే అందరూ నా ప్రతిభను గుర్తించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నేను ఆడుతున్నప్పుడల్లా తెలుగువాళ్లు ఏం అనుకుంటారంటే.. నా అన్నయ్య, తమ్ముడు ఆడుతున్నాడు.

ఓ తెలుగోడు మన జట్టుకు ఆడుతున్నాడని గర్వపడుతారు. ఇలాంటి ఫీలింగ్ మరే జట్టులో రాదు. చాలా పెద్ద అమౌంట్‌తో ఆఫర్లు వచ్చాయి. కానీ మన ప్లేయర్ మన టీమ్‌కు ఆడుతున్నానే ఫీల్ రాదు. డబ్బులు పెద్ద మ్యాటరే కాదు. బాగా ఆడుతుంటే డబ్బు అదే వస్తుంది. తెలుగు ఫీలింగ్, మన అనే ఫీలింగ్ ఏ జట్టులో రాదు. అందుకే సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కొనసాగాలనుకున్నాను.'అని నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు.

శభాష్.. నీతీష్!
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ నితీష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. డబ్బు కంటే నమ్మకాన్ని ఎక్కువ విలువ ఇస్తున్న ఈ కుర్రాడు మరింత సక్సెస్ అవుతాడని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Sunday, December 1, 2024, 18:41 [IST]
Other articles published on Dec 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+