Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs LSG: గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే.. సిరాజ్ భాయ్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్.. మరోసారి నోరు పారేసుకొని మూల్యం చెల్లించుకున్నాడు. లక్నో విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌పై స్లెడ్జింగ్‌కు దిగాడు. సిరాజ్ కవ్వింపులకు స్పందించని పూరన్.. బ్యాట్‌తో బదులిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే.. సిరాజ్ భాయ్!'అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అసలేం జరిగిదంటే..?
లక్నోసూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా సిరాజ్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ నాలుగో బంతిని సిరాజ్ బౌన్సర్‌గా సంధించగా అంపైర్ వైడ్ ఇచ్చాడు. తర్వాతి బంతిని కూడా బౌన్సర్‌గా వేయడంతో పూరన్ వదిలేసాడు. ఆ తర్వాత పూరన్‌ను సిరాజ్ తన మాటలతో కవ్వించాడు. సిరాజ్ స్లెడ్జింగ్‌కు స్పందించని పూరన్.. మరుసటి రెండు బంతులను, 6, 4గా తరలించి తన బ్యాట్‌తో ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. సిరాజ్ ఇలా స్లెడ్జింగ్‌కు దిగడం కొత్తేమి కాదు. తన మాటలతో బ్యాటర్లను రెచ్చగొట్టి.. వారి ఏకాగ్రతను దెబ్బతీయాలనే వ్యూహంలో భాగంగా సిరాజ్ ఇలా చేస్తుంటాడు. కొన్నిసార్లు సక్సెస్ అయినా.. మరికొన్ని సార్లు బ్యాటర్లకు బలయ్యాడు.

IPL 2025 Nicholas Pooran s Explosive Reply to Mohammed Siraj s Sledging in GT vs LSG Match

లక్నో భారీ విజయం..
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 33 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్(27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓటమిపాలైంది. షారుఖ్ ఖాన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. శుభ్‌మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 35), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 38) రాణించాడు. లక్నో బౌలర్లలో విల్ ఓ రూర్కీ(3/27) మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్(2/51), ఆయుష్ బదోని(2/4) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆకాశ్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న లక్నో.. ఓదార్పు విజయాన్నందుకుంది.

Story first published: Friday, May 23, 2025, 9:11 [IST]
Other articles published on May 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+