For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనన్య పాండేతో శుభ్‌మన్ గిల్.. రియాన్ పరాగ్‌ను ఆడుకుంటున్న ఫ్యాన్స్!

టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బాలీవుడ్ నటి అనన్య పాండేలు 'బీట్స్ ఇండియా' కంపెనీకి ప్రచార కర్తలుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు సదరు కంపెనీ కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

టీమిండియా భవిష్యత్తు సారథిగా శుభ్‌మన్ గిల్ ఎదుగుతున్నాడు. దాంతో అతనికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. పలు కంపెనీలు ప్రచారకర్తగా అతనితో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ హెడ్‌ఫోన్స్ సంస్థ బీట్స్ శుభ్‌మన్ గిల్‌తో పాటు అనన్య పాండేలతో బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

IPL 2025 Netizens trolled Riyan Parag after Shubman Gill and Ananya Pandey photo goes viral

ఈ విషయం గురించి శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. మైదానంలో తాను పరుగులు చేయడం ఎంత నిజమో.. బీట్స్ తమ కేటగిరిలో అగ్రస్థానంలో ఉన్నాయన్నాడు. బీట్స్ తీసుకొచ్చే ఉత్పత్తులను భారత్‌లో ఉపయోగించేందుకు ఉత్సాహంగా ఉన్నామని చెప్పాడు.

బీట్స్ హెడ్ ఫోన్స్‌తో శుభ్‌మన్ గిల్, అనన్య పాండేలు ఇచ్చి ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే అనన్య పాండేతో శుభ్‌మన్ గిల్ ఫోజు ఇవ్వడంపై నెటిజన్లు.. టీమిండియా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్ అనంతరం రియాన్ పరాగ్.. ఆన్‌లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ స్ట్రీమింగ్ సందర్భంగా అతను యూట్యూబ్ ఓపెన్ చేశాడు. అందులో తన సెర్చ్ హిస్టరీ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. స్టార్ హీరోయిన్ల హాట్ వీడియోలు వెతికిన తన యూట్యూబ్ హిస్టరీ ప్రత్యక్షమైంది. అన్యన పాండే హాట్, సారా అలీ ఖాన్ హాట్ అంటూ సెర్చ్ హిస్టరీలో ఉంది.

ఈ హీరోయిన్ల అందాల కోసం వెతికిన రియాన్ పరాగ్ విరాట్ కోహ్లీ పేరిట కూడా యూట్యూబ్ శోధన చేసినట్లుగా కనిపించింది. తన సెర్చ్ హిస్టరీని పరాగ్ హైడ్ చేయకపోవడంతో రియాన్ పర్సనల్ హిస్టరీ పబ్లిక్‌కు లీక్ అయ్యింది. దీంతో పరాగ్‌పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా అనన్య పాండేతో శుభ్‌మన్ గిల్ ఫోజు ఇవ్వడంతో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన రియాన్ పరాగ్.. జింబాబ్వే పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అనంతరం శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2025 సీజన్ మెగావేలంలోకి వెళ్తే అతను భారీ ధర పలికే ఛాన్స్ ఉంది.

Story first published: Wednesday, September 4, 2024, 15:02 [IST]
Other articles published on Sep 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+