Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్.. పోతూ పోతూ కారడవి నిర్మించిన సీఎస్‌కే!

ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) దాదాపుగా తప్పుకుంది. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది ఆ జట్టుకు 6వ ఓటమి కావడంతో పాయింట్స్ టేబుల్‌లో డాడీస్ ఆర్మీ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది.

తాజా పరాజయం సీఎస్‌కే ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు. సీఎస్‌కే రన్ రేట్(-1.392) కూడా దారుణంగానే ఉంది. ఈ టోర్నీలో ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 విజయం సాధిస్తేనే సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడితే ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

IPL 2025 Netizens Troll CSK For Out Playoffs race and Contributing to Green Dot Balls

ఒకవేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్(ఏప్రిల్ 25), పంజాబ్ కింగ్స్(ఏప్రిల్ 30), ఆర్‌సీబీ(మే 3), కేకేఆర్(మే7), రాజస్థాన్ రాయల్స్(మే12), గుజరాత్ టైటాన్స్(మే18)తో తలపడనుంది. ఇందులో మూడు మ్యాచ్‌లు చెన్నై వేదికగానే జరగనున్నాయి.

ప్రస్తుతం సీఎస్‌కే ఫామ్ నేపథ్యంలో ఆ జట్టు తదుపరి 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం కష్టమే. ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా సీఎస్‌కే నిలవనుంది. ఈ క్రమంలోనే సీఎస్‌కేపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్‌కే పోతూ పోతూ.. కారడవి నిర్మించి పోయిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఐపీఎల్‌లో ప్రతీ డాట్ బాల్‌కు బీసీసీఐ 18 మెక్కలు నాటుతున్న విషయం తెలిసిందే.

ఈ సీజన్‌లో సీఎస్‌కే బ్యాటర్లు ఆడినన్న డాట్ బాల్స్ ఏ జట్టు ఆడలేదు. ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే బ్యాటర్లు 284 డాట్ బాల్స్ ఆడారు. ఈ లెక్కన సీఎస్‌కే పేరిట బీసీసీఐ 5,112 చెట్లు నాటనుంది. ఈ సీజన్ ముగిసే సరికి ఈ సంఖ్య 10వేలకు చేరుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

Story first published: Monday, April 21, 2025, 14:14 [IST]
Other articles published on Apr 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+