For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: భీకరంగా ముంబై ఇండియన్స్.. తుది జట్టు అంచనా ఇదే!

ఆరంభంలో ఇబ్బంది పడటం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)‌లో ముంబై ఇండియన్స్‌‌ శైలి‌ ఇది. ఆటలోనే కాదు టైటిల్స్‌‌ నెగ్గడంలోనూ ఆ జట్టు తీరు అదే. తొలి‌ ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్‌‌ వరకూ వచ్చిన ముంబై ఇండియన్స్.. తర్వాతి 8 సీజన్లలో ఏకంగా 5 టైటిల్స్‌‌ నెగ్గింది. ఈ ఐదు ట్రోఫీలు‌ రోహిత్‌‌ శర్మ సారథ్యంలోనే రావడం విశేషం.

అయితే ఐపీఎల్ 2022 మెగా వేలం తర్వాత ముంబై ఆధిపత్యానికి బ్రేక్ పడింది. దాంతో గత 3 సీజన్లలో ముంబై దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో అయితే పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్.. 2023లో మెరుగైన ప్రదర్శన చేసినా ప్లేఆఫ్స్‌కే పరిమితమైంది. కానీ గతేడాది పేలవ ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిలిచింది.

IPL 2025 Mumbai Indians strength weakness and best playing 11

భీకరంగా ముంబై..
రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం ముంబై ఇండియన్స్ ఓటమికి కారణమైంది. అయినా హార్దిక్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కోర్ టీమ్‌ను అంటిపెట్టుకున్న ముంబై ఇండియన్స్.. వేలంలో జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. భారత స్టార్ ఆటగాళ్లతోనే ముంబైకి సగం బలం రాగా.. బలహీనతలను వేలంలో అధిగమించింది. దాంతోనే పేపర్‌పై చాలా భీకరంగా కనబడుతోంది. మార్చి 23న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.

ముంబై ఇండియన్స్ బలాలు..

  • రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రాలతో బలమైన కోర్ టీమ్
  • జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్‌‌లతో పటిష్టంగా ఉన్న పేస్ విభాగం
  • స్పెషలిస్ట్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా మిచెల్ సాంట్నర్ ఉండటం
  • విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండటం

ముంబై ఇండియన్స్ బలహీనతలు..

  • స్పెషలిస్ట్ ఇండియన్ స్పిన్నర్‌ లేకపోవడం. కర్ణ్ శర్మపై నమ్మకం ఉంచలేని పరిస్థితి.
  • మిచెల్ సాంట్నర్‌కు ఐపీఎల్‌ ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం
  • జస్‌ప్రీత్ బుమ్రాకు ఫిట్‌నెస్ సమస్యలు
  • ఓవర్‌సీస్ ఆటగాళ్ల కుదింపు
  • బ్యాకప్ ఇండియన్ పేసర్లు, బ్యాటర్లు లేకపోవడం

టీమ్ కాంబినేషన్..
విల్ జాక్స్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో ఆడనుండగా.. రాబిన్ మింజ్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగనున్నాడు. అల్లా గజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్ స్పిన్నర్లుగా ఆడనుండగా.. దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు. నమన్ ధీర్, కర్ణ్ శర్మ, గజన్‌ఫర్‌లను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించవచ్చు. ర్యాన్ రికెల్టన్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలనుకుంటే విల్ జాక్స్ మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. అప్పుడు గజన్‌ఫర్ బెంచ్‌కు పరిమితమవుతాడు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)

విల్ జాక్స్/ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాబిన్ మింజ్ (కీపర్), మిచెల్ సాంట్నర్, అల్లా ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంపాక్ట్ ప్లేయర్స్: కర్ణ్ శర్మ, నమన్‌ధీర్, గజన్‌ఫర్

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:
హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా గజన్‌ఫర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లీ, క్రిష్ణన్ ష్రిజిత్, రాజ్ బవా, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, లిజాడ్ విలియమ్స్, విగ్నేష్ పుతుర్.

Take a Poll
Story first published: Thursday, March 13, 2025, 10:42 [IST]
Other articles published on Mar 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+