For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2 రికార్డ్స్ ఏంటంటే..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఐదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆరో ట్రోఫీని ముద్దాడేందుకు ముంబై రెండు అడుగుల దూరంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2 రికార్డ్స్ అభిమానులను కలవరపెడుతున్నాయి.

18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు నాలుగు సార్లు క్వాలిఫయర్-2 మ్యాచ్‌ ఆడింది. అయితే ఈ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు సార్లు గెలిచి మరో రెండు సార్లు ఓడింది. రెండు సార్లు గెలిచినప్పుడు ఫైనల్లో కూడా విజేతగా నిలిచింది. అయితే ఎలిమినేటర్ ద్వారా క్వాలిఫయర్-2‌కు అర్హత సాధించిన రెండు సందర్భాల్లో ముంబై ఇండియన్స్‌కు ఓటమే ఎదురైంది. ఈ రికార్డే అభిమానులను ఆందోళనపరుస్తోంది.

IPL 2025 Mumbai Indians Qualifier 2 Records Ahead of Punjab Kings Clash

ఆర్‌సీబీ చేతిలో ఓటమి..
ఐపీఎల్ 2011లో తొలి క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చేతిలో 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఎలిమినేటర్ ద్వారా ముంబై క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఐపీఎల్ 2013లో క్వాలిఫయర్-1లో ఓడిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఫైనల్లో సీఎస్‌కేను ఓడించి తొలి టైటిల్‌ను ముద్దాడింది.

ఐపీఎల్ 2017లో క్వాలిఫయర్-1లో ఓడిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేసింది. ఫైనల్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌ను ఓడించి రెండో టైటిల్‌ను అందుకుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎలిమినేటర్‌లో గెలిచిన ముంబై.. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 62 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఒక్కటి గెలవలేదు..
ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి క్వాలిఫయర్-2కి చేరుకున్న సందర్భాల్లో, ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ గెలవలేదు. కానీ ఓవరాల్‌గా ప్లే ఆఫ్స్‌లో ముంబై ఇండియన్స్‌కు మెరుగైన రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు ముంబై ఐదు టెటిళ్లు గెలిచి అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టుగా సీఎస్‌కేతో సమంగా కొనసాగుతోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కసారి క్వాలిఫయర్-2 మ్యాచ్‌ ఆడింది. ఐపీఎల్ 2014లో క్వాలిఫయర్-2లో గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకుంది. 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ చేరిన పంజాబ్.. క్వాలిఫయర్-1లో ఓడి.. క్వాలిఫయర్-2లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైంది.

Story first published: Saturday, May 31, 2025, 14:53 [IST]
Other articles published on May 31, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+