Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ రెండు తప్పిదాల వల్లే ఓడిపోయాం: ధోనీ

బ్యాటింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడం, బౌలింగ్‌లో పవర్ ప్లేలోనే ధారళంగా పరుగులిచ్చుకోవడం తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ తమ ఓటమి గల కారణాలను తెలిపాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన కుర్రాళ్లకు విలువైన సలహా ఇచ్చాడు.

మంచి టార్గెట్.. కానీ
'మా లక్ష్యం పోరాడదగినదే. అయితే వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోతే లోయరార్డర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. 20 ఓవర్లు ఆడలేకపోతాం. డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను రిస్కీ షాట్స్ ఆడాడు. మా రన్ రేట్ కూడా బాగానే ఉంది. కానీ లోయరార్డర్‌లో మేం కొంచెం మెరుగవ్వాలి. వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టుకు నష్టం చేసింది. అన్షుల్ కంబోజ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. సీమ్ మూమెంట్ లేకపోవడంతో స్వింగ్ రాబట్టలేకపోయాడు. కానీ అతను చాలా వేగంగా బౌలింగ్ చేశాడు. ఈ రోజు అతనే మా బౌలింగ్ బాధ్యతను తీసుకున్నాడు. కంబోజ్ మంచి యార్కర్లు కూడా వేయగలడు.

IPL 2025 MS Dhoni Reveals What Went Wrong for CSK vs RR


పవర్ ప్లే మా కొంపముంచుతోంది..
పవర్ ప్లే మాకు బలహీనతగా మారింది. డిఫెండ్ చేసుకునేటప్పుడు పవర్ ప్లేలో ఎక్కువగా పరుగులు ఇవ్వకూడదు. మేం మెరుగుపరుచుకోవాల్సిన అంశం ఇది. తొలి 6 ఓవర్లలోనే అన్షుల్ 3 ఓవర్లు వేసాడు. సీమ్ మూమెంట్ లేకుండా.. బ్యాటర్లు సెట్ అయిన తర్వాత పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం చాలా కష్టం. కుర్రాళ్లంతా నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాలి. 200 స్ట్రైక్‌రేట్ కోసం కాకుండా పరిస్థితులు తగ్గట్లు ఆడటం నేర్చుకోవాలి. ముఖ్యంగా బ్యాటర్లు తమను తాము నమ్ముకోవాలి. యువ బ్యాటర్లంతా తొలి సీజన్‌ ఎలా ఆడారో.. అదే జోరును కొనసాగించడం చాలా ముఖ్యం. నిలకడగా రాణించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే బ్యాటర్‌గా మరింత ఎదగడానికి సహాయపడుతుంది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

రాజస్థాన్ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే(20 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43), డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), శివమ్ దూబే(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) రాణించారు.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుధ్‌వీర్ సింగ్(3/47) , ఆకాశ్ మధ్వాల్(3/29) మూడేసి వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, వానిందు హసరంగా తలో వికెట్ పడగొట్టారు. మరోసారి ధోనీ జిడ్డు బ్యాటింగ్ సీఎస్‌కే కొంపముంచింది.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), సంజూ శాంసన్(31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), ధ్రువ్ జురెల్(12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31 నాటౌట్), యశస్వి జైస్వాల్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) రాణించారు. చెన్నై బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(2/41) రెండు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, May 20, 2025, 23:50 [IST]
Other articles published on May 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+