For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GT vs SRH: కొంపముంచిన మహమ్మద్ షమీ.. గిల్, బట్లర్ ఊచకోత!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాప్-3 బ్యాటర్లు మరోసారి దుమ్మురేపారు. సాయి సుదర్శన్(23 బంతుల్లో 9 ఫోర్లతో 48), శుభ్‌మన్ గిల్(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76), జోస్ బట్లర్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను ఊచకోత కోసారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోర్ చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/35) మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ తలో వికెట్ తీసారు. కీలక క్యాచ్‌లను వదిలేయడంతో పాటు చెత్త ఫీల్డింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది.

కొంపముంచిన షమీ..
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ల ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. అహ్మదాబాద్ వికెట్‌పై కీలకం అవుతాడని భావించిన మహమ్మద్ షమీ.. 3 ఓవర్లలో 48 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ తీయలేదు. షమీ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. తొలి ఓవర్‌లో 11 పరుగులిచ్చిన షమీ.. మూడో ఓవర్‌లో 5 బౌండరీలతో 20 పరుగులు సమర్ఫించుకున్నాడు. 10వ ఓవర్‌లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన షమీ 17 పరుగులిచ్చాడు. దాంతో అతన్ని ప్యాట్ కమిన్స్.. బయటకు పంపించాడు. అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్‌ను ఫీల్డింగ్‌కు తీసుకొచ్చాడు. మరో ఓవర్ వేసే అవకాశం ఉన్నా.. షమీకి బంతినిచ్చే సాహసం కమిన్స్ చేయలేదు.

IPL 2025 Mohammed Shami Flop show Help GT post 224 against SRH

చెలరేగిన గుజరాత్ త్రయం..
షమీ చెత్త బౌలింగ్‌తో చెలరేగిన గుజరాత్ ఓపెనర్లు పవర్ ప్లేలోనే 82 పరుగులు చేశారు. తొలి వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాయి సుదర్శన్‌ను జీషన్ అన్సారీ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి బట్లర్ రాగా.. శుభ్‌మన్ గిల్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను ప్యాట్ కమిన్స్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. శుభ్‌మన్ గిల్ రనౌటవ్వగా.. సుందర్‌తో కలిసి బట్లర్ దూకుడుగా ఆడాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో బట్లర్, వాషింగ్టన్ సుందర్(21), రాహుల్ తెవాటియా(6), రషీద్ ఖాన్(0) ఔటయ్యారు.

Story first published: Friday, May 2, 2025, 22:10 [IST]
Other articles published on May 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+