For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: కేఎల్ రాహుల్ స్వార్థపరుడు.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా సంచలన వ్యాఖ్యలు!

లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) జట్టును వీడిన కేఎల్ రాహుల్‌పై ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ స్వార్థపరుడని, వ్యక్తిగత లక్ష్యాల కోసమే ఆడుతాడని విమర్శించాడు. అతనిలా వ్యక్తిగత లక్ష్యాల కంటే జట్టు విజయం కోసం ఆడే ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నామని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ జాబితాలను 10 ఫ్రాంచైజీలు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ మొత్తం ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టీమ్‌లో కొనసాగేందుకు అయిష్టత చూపడంతో వేలంలోకి వదిలేసింది.

IPL 2025 LSG Owner Sanjiv Goenka s Brutal Dig At KL Rahul Wanted players who have mindset to win

నికోలస్ పూరన్‌ను రూ. 21 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకున్న లక్నో.. రవిబిష్ణోయ్, మయాంక్ యాదవ్‌లను రూ. 11 కోట్లకు అట్టిపెట్టుకుంది. అనామక ఆటగాళ్లు అయిన మోహ్‌సిన్ ఖాన్, ఆయుష్ బదోనిలను రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ రిటెన్షన్ అనంతరం సంజీవ్ గోయెంకా అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడాడు. తమ రిటెన్షన్ విధానాన్ని వివరించాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ పేరు ప్రస్తావించకుండా అతని‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

'మా తొలి రిటెన్షన్ ఆటోమెటిక్ ఛాయిస్. రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం ఇద్దరు అనామక ఆటగాళ్లను ఎంచుకున్నాం. వారు మోహ్‌సిన్ ఖాన్, ఆయుష్ బదోని. జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్, టీమ్ విశ్లేషకుడు కలిసి వారిని ఎంపిక చేశారు. గత సీజన్‌కు చెందిన ముగ్గురు బౌలర్లను కొనసాగించాం. ఆ ముగ్గురు భారత ఆటగాళ్లే. గత సీజన్‌లో నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడాడు. ఆయుష్ 6, 7 స్థానాల్లో సత్తా చాటాడు.

వ్యక్తిగత లక్ష్యాలు, మైలురాళ్ల కోసం కాకుండా జట్టు విజయం కోసం ఆడే ఆటగాళ్లను ఎంచుకున్నాం. కోర్‌ టీమ్ సభ్యులను ఎంచుకోవాలనుకున్నాం. దాదాపు ఆ పని పూర్తి చేశాం. 'అని సంజీవ్ గోయెంకా చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం సమంజసం కాదని మండిపడుతున్నారు. జట్టులో నుంచి వెళ్లినంత మాత్రానా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సంజీవ్ గోయెంకా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.


ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో తీవ్ర అసంతృప్తికి గురైన సంజీవ్ గోయెంకా.. మైదానంలోనే టీవీ కెమెరాలు ఉన్నాయనే విషయం మరిచి కేఎల్ రాహుల్‌ను మందలించాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది.

ఈ సంఘటనతోనే రాహుల్ మనస్థపానికి గురయ్యాడని, జట్టును వీడేందుకు సిద్దమయ్యాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాహుల్‌ను పలు జట్లు అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అతను ఆర్‌సీబీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లక్నో సూపర్ జెయింట్స్ రిటెన్షన్ లిస్ట్:

నికోలస్ పూరన్- రూ.21 కోట్లు

రవి బిష్ణోయ్- రూ.11 కోట్లు

మయాంక్ యాదవ్- రూ.11 కోట్లు

మోహ్‌సిన్ ఖాన్- రూ.4 కోట్లు

ఆయుష్ బదోని- రూ.4 కోట్లు

రిటెన్షన్‌కు ఖర్చు అయిన డబ్బులు: రూ.41 కోట్లు

పర్స్‌లో మిగిలి ఉన్న డబ్బులు: రూ. 69 కోట్లు

లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా:
కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్య, మార్కస్ స్టొయినిస్, నవీనుల్ హక్, యశ్ ఠాకూర్, దీపక్ హుడా, మయాంక్ యాదవ్, అమిత్ మిశ్రా, ప్రెరాక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్, శివమ్ మావి, షామర్ జోసెఫ్, డేవిడ్ విల్లీ, కైల్ మేయర్స్, ఆస్టన్ టర్నర్, సిద్ధార్థ్, యుద్వీర్ సింగ్, అర్షద్ ఖాన్, అర్షిన్ కులకర్ణి

Story first published: Thursday, October 31, 2024, 22:12 [IST]
Other articles published on Oct 31, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+