Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యే బిడ్డా.. ఇది నా అడ్డా- కేఎల్ రాహుల్ (వీడియో)

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తనదైన క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆరంభంలో స్లోగా ఆడిన రాహుల్.. ఆ తర్వాత భారీ షాట్లతో చెలరేగాడు. రాహుల్ విధ్వంసంతో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ‌ని ఓడించింది. అయితే ఈ విజయానంతరం కేఎల్ రాహుల్ చేసుకున్న సంబరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

సిక్సర్‌తో విజయలాంఛనాన్ని ఖాయం చేసిన రాహుల్.. ఆగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు. 'ఇది నా అడ్డా'అంటూ అభిమానులకు తెలియజేశాడు. ఇక్కడ ఎలా ఆడాలో తనకు బాగా తెలుసని సైగలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను బూతులు కూడా వాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ప్రదర్శనతో రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం తన సెలెబ్రేషన్స్‌పై ప్రశ్నించగా.. రాహుల్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.

IPL 2025 KL Rahul s celebration goes viral after 93-run knock against RCB Video

వికెట్ కీపింగ్ చేయడంతో ఈ పిచ్ ఎలా ఉందనే విషయం అర్థమైందన్నాడు. రజత్ పటీదార్ క్యాచ్ వదిలేయడం తనకు కలిసొచ్చిందని తెలిపాడు. ఇది తన హోమ్ గ్రౌండ్ అని, ఇక్కడి పరిస్థితుల గురించి ఇతరుల కంటే తనకే బాగా తెలుసునని చెప్పుకొచ్చాడు.

'ఇదో ట్రిక్కీ వికెట్. 20 ఓవర్ల పాటు కీపింగ్ చేయడం నాకు కలిసొచ్చింది. ఈ పిచ్ ఎలా ఉందనే విషయం తెలిసింది. వికెట్ కీపర్‌గానే పిచ్ కండిషన్స్‌ను అంచనా వేసాను. ఇది టూపేస్‌గా లేదు. వన్ పేస్‌గా ఉంది. ఎలాంటి షాట్లు ఆడాలో నాకు తెలుసు. కేవలం మంచి ఆరంభం కోసం చూశాను. ఆ తర్వాత ఆటను ముందుకు తీసుకోవచ్చని భావించాను.

సిక్స్ కొట్టాలంటే ఎవర్ని టార్గెట్ చేయాలి? ఎటు వైపు కొట్టాలనే విషయం నాకు తెలుసు. వికెట్ కీపింగ్ చేయడం వల్ల ఏ బ్యాటర్ ఎలా ఆడాడు? ఎలా ఔటయ్యడనే విషయం తెలిసొస్తుంది. నా క్యాచ్ వదిలేయడం నా అదృష్టం. ఇది నా హోమ్ గ్రౌండ్. ఇక్కడి పరిస్థితుల గురించి ఇతరుల కంటే నాకే ఎక్కువ తెలుసు. ఇక్కడ ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 169 పరుగులు చేసి గెలుపొందింది.

Story first published: Friday, April 11, 2025, 7:54 [IST]
Other articles published on Apr 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+