మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఒక్కసారిగా తన ఉగ్రరూపాన్ని చూపించాడు. క్లాస్ బ్యాటర్‌గా.. వివాదరహితుడిగా గుర్తింపు పొందిన రాహుల్.. తొలి సారి వైల్డ్ రియాక్షన్‌తో సంబరాలు చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన 12 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లోనూ రాహుల్ ఏనాడు ఇలా ఆగ్రహంగా సంబరాలు చేసుకోలేదు. సౌమ్యుడిగా పేరొందిన రాహుల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలింపించి ఓ స్టేట్‌మెంట్ పాస్ చేశాడు.
విన్నింగ్ షాట్‌గా సిక్సర్ కొట్టిన వెంటనే.. 'ఏ బిడ్డా.. ఇది అడ్డా'అని అగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు. బూతు పదాలు కూడా వాడాడు. బ్యాట్‌తో సర్కిల్ గీస్తూ మరి చెప్పాడు. 'ఇది నా గ్రౌండ్.. ఎలా ఆడాలో నాకు తెలుసు'అని సైగలు చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భావోద్వేగాలను ప్రదర్శించని రాహుల్.. ఇలా వైల్డ్‌గా రియాక్ట్ అవ్వడం చర్చనీయాంశమైంది.

ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెచ్చగొట్టడంతోనే రాహుల్ ఇలా సంబరాలు చేసుకున్నాడని కొందరంటే.. మెగా వేలంలో ఆర్‌సీబీ తనను పట్టించుకోకపోవడాన్ని మనసులో పెట్టుకొని ఇలా రివేంజ్ తీర్చుకున్నాడని మరికొందరు కామెంట్ చేశారు. రాహుల్ మాత్రం.. 'ఇది నా హోమ్ గ్రౌండ్ అని'చెప్పే క్రమంలోనే అలా వైల్డ్‌గా రియాక్ట్ అయ్యానని మ్యాచ్ అనంతరం బదులిచ్చాడు.
ఇక ఫ్రాంచైజీ సోషల్ మీడియా టీమ్‌తో మాట్లాడుతూ.. ఈ సంబరాల వెనుక ఉన్న అసలు రహాస్యాన్ని వెల్లడించాడు. ఏ ఆటగాడిని ఉద్దేశించి చేయలేదని, తన ఫేవరేట్ సినిమా అయినా కాంతారా నుంచి ఈ సెలెబ్రేషన్‌ను తీసుకున్నానని స్పష్టత ఇచ్చాడు.
'చిన్నస్వామి స్టేడియం నాకు ప్రత్యేకమైన ప్లేస్. ఈ సెలెబ్రేషన్ నా ఫేవరేట్ 'కాంతార'మూవీలోనిది. ఇది కేవలం ఈ చిన్నస్వామి మైదానం నా హోమ్ గ్రౌండ్ చెప్పే ఉద్దేశంతోనే సెలెబ్రేట్ చేసుకున్నది. ఈ వికెట్‌పై నేను క్రికెటర్‌గా ఎదిగాను. ఇది నా గ్రౌండ్'అని రాహుల్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 169 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.