Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఫసక్.. ఫసక్.. కావ్య పాప క్యూట్ రియాక్షన్! (వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. క్యూట్ రియాక్షన్‌తో ఆకట్టుకున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉప్పల్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో కావ్య మారన్ సందడి చేశారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో కావ్య మారన్ ఎగిరి గంతేసారు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ విప్రజ్ నిగమ్ రనౌట్ అయిన సమయంలో కావ్య మారన్ ఇచ్చిన క్యూట్ రియాక్షన్.. ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

విప్రజ్ రనౌట్.. ఫసక్.. ఫసక్
జీషన్ అన్సారీ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని ట్రిస్టన్ స్టబ్స్.. డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడి క్విక్ డబుల్‌ తీసాడు. అయితే నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న విప్రజ్ నిగమ్ సింగిల్ పూర్తి చేసి రెండో పరుగుకు నిరాకరించాడు. అతన్ని గమనించని స్టబ్స్.. రెండో పరుగు పూర్తి చేయగా.. బౌలర్ ఎండ్‌‌ వైపు జీషన్ అన్సారికీ అనికేత్ వర్మ బంతిని అందించాడు. అతను వికెట్లను కొట్టేడయంతో విప్రజ్ నిగమ్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఈ రనౌట్‌కు కావ్య మారన్ ఎగిరి గంతేసారు. ఫసక్ ఫసక్ అని చేతులతో సైగలు చేస్తూ సెలెబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IPL 2025 Kavya Maran Cute Reaction Goes Viral after Vipraj Nigam Run Out in SRH vs DC Match
Photo Credit: screen grab for JioHotstar

ప్యాట్ కమిన్స్ ధాటికి 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును విప్రజ్ నిగమ్, ట్రిస్టన్ స్టబ్స్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ స్వీయ తప్పిదంతో వికెట్ పారేసుకోవడంతో కావ్య మారన్ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఫసక్ ఫసక్ అంటూ ఆమె సంబరాలు చేసుకున్నారు.

వర్షంతో ఆనందం ఆవిరి..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(36 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్), అషుతోష్ శర్మ(26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3/19) మూడు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసారు. సన్‌రైజర్స్ ఆనందాన్ని వరుణుడు ఆగం చేశాడు. సరిగ్గా సన్‌రైజర్స్ బ్యాటింగ్‌ సమయానికి భారీ వర్షం రావడంతో మ్యాచ్‌ ఆగిపోయింది. ఈ సీజన్‌లో ఆడక ఆడక ఒక్క మ్యాచ్ ఆడితే వర్షం పడిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Monday, May 5, 2025, 22:33 [IST]
Other articles published on May 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+