టీమిండియా యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా వేలం చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కానీ ఘనతను అందుకున్నాడు. అత్యధిక సాలరీ హైక్ అందుకున్న ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో జితేశ్ శర్మను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రూ. 11 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో జితేశ్ శర్మను పంజాబ్ కింగ్స్ రూ. 20 లక్షల కనీస ధరకు తీసుకుంది. ఇప్పుడు ఏకంగా 55 రెట్ల అధిక ధర దక్కింది. ఐపీఎల్‌లో ఇంత భారీ మొత్తంలో సాలరీ హైక్ సాధించిన ఆటగాడు మరొకరు లేరు.

గత రెండు సీజన్లలో పంజాబ్ తరఫున జితేశ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్స్‌లు కొట్టగలిగే జితేశ్ వికెట్ కీపర్. మరోవైపు ఆర్‌సీబీకి దినేశ్ కార్తిక్ తర్వాత ఫినిషర్ కమ్ వికెట్ కీపర్ అవసరం చాలా వచ్చింది. ఫిల్‌సాల్ట్ ఉన్నప్పటికీ.. అతను ఓపెనర్ కావడంతో లోయర్ ఆర్డర్‌లో జితేశ్ ప్రధాన పాత్ర పోషిస్తాడని ఆర్‌సీబీ భావిస్తోంది. జితేశ్ శర్మ పంజాబ్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లకు కూడా జితేశ్ శర్మ సాధించిన ఘనత దక్కలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు.
ఐపీఎల్ చరిత్రలోనే ఇవి అత్యధిక ధరలు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రూ. 16 కోట్లు తీసుకున్న రిషభ్ పంత్.. తాజాగా వేలంలో రూ. 27 కోట్లు సొంతం చేసుకున్నాడు. అదనంగా రూ. 11 కోట్లు మాత్రమే అందుకున్నాడు. దాంతొ అతనికి 175 శాతం హైక్ మాత్రమే లభించింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్‌కు 200 శాతం హైక్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్‌కు కేకేఆర్ రూ. 12.25 కోట్లు చెల్లించింది. ఇప్పుడు పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.